Sankranti 2023: సంక్రాంతి కాంపిటీషన్.. ఇప్పటికే కర్చీఫ్ వేసిన 6 సినిమాలు!

2023 సంక్రాంతి మీద కర్చీఫ్ వేసే పని మొదలయిపోయింది. ఇప్పటికే పైకి చెప్పకపోయినా అదే టార్గెట్ గా చాలామంది మేకర్స్ సిద్ధమవుతున్నారు. ఇంకా సంక్రాతికి ఏడు నెలల సమయం ఉన్నా..

Sankranti 2023: సంక్రాంతి కాంపిటీషన్.. ఇప్పటికే కర్చీఫ్ వేసిన 6 సినిమాలు!

Sankranti 2023

Updated On : January 13, 2023 / 10:48 AM IST

Sankranti 2023: 2023 సంక్రాంతి మీద కర్చీఫ్ వేసే పని మొదలయిపోయింది. ఇప్పటికే పైకి చెప్పకపోయినా అదే టార్గెట్ గా చాలామంది మేకర్స్ సిద్ధమవుతున్నారు. ఇంకా సంక్రాతికి ఏడు నెలల సమయం ఉన్నా.. ముందుగానే మేమున్నామని డేట్ లాక్ చేసుకొనే పని మొదలైంది. ఒకపక్క చకచకా షూటింగ్ జరుగుతుందనే.. మరోపక్క రిలీజ్ డేట్ నాటికి అన్ని పనులు ముగించాలని సిద్ధమవుతున్నారు. ఇందులో పాన్ ఇండియా సినిమాలే ఎక్కువగా ఉండగా.. చిన్నా చితకా హీరోలు కూడా ఏమో అవకాశం వస్తుందేమో అని ఆశగా ఎదురుచూసున్నారు.

Movie Releases: షూటింగ్ ఎప్పుడో మొదలైనా.. రిలీజ్ ఎప్పుడో క్లారిటీ లేదే!

ప్రభాస్ బాలీవుడ్ రామాయణం ‘ఆదిపురుష్’ డేట్ ఇప్పటికే లాక్ చేశారు. 2023 సంక్రాంతికే రాముడిగా ప్రభాస్ రాబోతున్నాడు. రాముడి బ్యాక్ డ్రాప్ లో రూపొందటంతో ప్యాన్ ఇండియా రేంజ్ లో ఓపెనింగ్స్ రాబట్టుకునేందుకు ఇదే సరైన సమయం కావడంతో దాదాపుగా సంక్రాంతి రావడం పక్కాగా కనిపిస్తుంది. త్వరలోనే ఈ డేట్ కూడా ప్రకటించే ఛాన్స్ కనిపిస్తుంది. ప్రభాస్ కు తోడుగా పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లుని ఇదే బరిలో దింపబోతున్నారు. క్రిష్ డైరెక్షన్ లో ఏఎం రత్నం నిర్మించిన ఈ సినిమా పవర్ స్టార్ కెరీర్ లోనే పాన్ ఇండియా సినిమా కాగా అదే స్థాయిలో తెరకెక్కిస్తున్నారు.

Movie Releases: మహేష్ లాస్ట్.. ఇక సందడంతా చిన్న హీరోలదే!

ఇక, తమిళ స్టార్ హీరో విజయ్ రష్మిక మందన్న కాంబోలో వంశీ పైడిపల్లి దర్శకుడిగా మొదలైన తలపతి 66 కూడా పొంగల్ రేస్ లో ఉంటుందని దిల్ రాజు పలు సందర్భాల్లో చెబుతూ వస్తున్నారు. విజయ్ దేవరకొండ సమంతాలతో శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్న మూవీ కూడా సంక్రాంతికే వచ్చే ఛాన్స్ కనిపిస్తుంది. మెహర్ రమేష్ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి భోళా శంకర్ కూడా సంక్రాంతికి రాబోతోంది. పైకి చెప్పకపోయినా రామ్ చరణ్-శంకర్ సినిమా కూడా 2023 సంక్రాంతి బరిలోకి దింపాలని నిర్మాత దిల్ రాజు పట్టుదలగా ఉన్నట్లు తెలుస్తుంది. ఏడు నెలల ముందే ఈ రేంజ్ కాంపిటీషన్ ఉందంటే ఇంక అప్పటికి ఎలా ఉంటుందో?!