2025 Movies : 2025 లో మోస్ట్ వెయిటింగ్ సినిమాలు ఇవే..

2025 పవర్ ప్యాక్డ్ ఎంటర్టైన్మెంట్ కి రెడీ అవుతోంది. ఒకటి కాదు రెండు కాదు వరసపెట్టి మోస్ట్ వెయిటింగ్ సినిమాలన్నీ 2025 లోనే రిలీజ్ కాబోతున్నాయి.

2025 Movies : 2025 లో మోస్ట్ వెయిటింగ్ సినిమాలు ఇవే..

2025 Most Waiting Movies Details Here

Updated On : January 1, 2025 / 9:50 PM IST

2025 Movies : 2024లో ఇంట్రస్టింగ్ సినిమాలు రిలీజ్ అయినా వరసగా సినిమాలు థియేటర్లోకొచ్చినా కొంతమంది హీరోలు మాత్రం అసలు థియేటర్ మొహమే చూడలేదు. కానీ నెక్ట్స్ ఇయర్ అలా కాదు ఒకరిద్దరు తప్ప మ్యాగ్జిమమ్ అందరు హీరోలు సాలిడ్ సినిమాలతో థియేటర్లోకొస్తున్నారు.

2025 పవర్ ప్యాక్డ్ ఎంటర్టైన్మెంట్ కి రెడీ అవుతోంది. ఒకటి కాదు రెండు కాదు వరసపెట్టి మోస్ట్ వెయిటింగ్ సినిమాలన్నీ 2025 లోనే రిలీజ్ కాబోతున్నాయి. సంక్రాంతి నుంచి మొదలుపెట్టి సమ్మర్ లో పీక్ స్టేజ్ కి చేరి ఇయర్ ఎండ్ వరకూ ఈ సారి అదిరిపోయే సినిమాలు థియేటర్లోకొస్తున్నాయి. ముందుగా సినిమాలకు పెద్ద సీజన్ అయిన సంక్రాంతికి పెద్ద సినిమాలు పోటీపడుతున్నాయి.

2025 లోనే ఫస్ట్ రిలీజ్ అవుతున్న పెద్ద సినిమా గేమ్ ఛేంజర్. శంకర్, చరణ్ కాంబినేషన్లో దిల్ రాజు ప్రొడ్యూస్ చేస్తున్న గేమ్ ఛేంజర్ మూవీ పాన్ ఇండియా వైడ్ గా జనవరి 10న గ్రాండ్ గా థియేటర్లోకొస్తోంది. ఇప్పటికే సినిమా అమెరికా ప్రమోషన్లతో మంచి బజ్ తెచ్చుకుని అడ్వాన్స్ బుకింగ్స్ ని ఓ రేంజ్ లో చేస్తోంది. జనవరి 10న గేమ్ చేంజర్ తర్వాత బాబీ, బాలయ్య కాంబినేషన్లో సితార, శ్రీకర, ఫార్చ్యూన్ ఫోర్ బ్యానర్స్ పై తెరకెక్కిన డాకు మహారాజ్ జనవరి 12న థియేటర్లోకొస్తోంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జనవరి 4న గ్రాండ్ గా అమెరికాలో ప్లాన్ చేసింది టీమ్. సంక్రాంతి రేస్ లో జనవరి 14న రిలీజ్ అవుతోంది సంక్రాంతికి వస్తున్నాం సినిమా. వెంకటేశ్, అనిల్ రావిపూడి కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఈ సినిమా రిలీజైన ప్రమోషనల్ కంటెంట్ తో పాటు పాటలతో సోషల్ మీడియాలో ఫుల్ బజ్ క్రియేట్ చేసుకుంది.

Also See : Adivi Sesh : న్యూ ఇయర్ రోజు చండీహోమం చేసిన అడివిశేష్.. ఫ్యామిలీతో శేష్ ఫోటోలు చూశారా?

ఫిబ్రవరి కూడా ఇంట్రస్టింగ్ సినిమాలు థియేటర్లోకొస్తున్నాయి. 2024 క్రిస్మస్ కి రిలీజ్ అవ్వాల్సిన తండేల్ ఫిబ్రవరి 7కి పోస్ట్ పోన్ చేసుకుంది. అప్పటికే సంక్రాంతి సీజన్ అయిపోతుంది కాబట్టి తండేల్ ని ఫుల్ ఫ్లెడ్జ్ గా రిలీజ్ చేస్కోవచ్చు. నాగచైతన్య, సాయిపల్లవి క్రేజీ కాంబినేషన్లో చందూ మొండేటి డైరెక్షన్లో ఇంట్రస్టింగ్ కాన్సెప్ట్ తో తెరకెక్కుతోంది తండేల్ .

ఫిబ్రవరి 14 వాలంటైన్ సీజన్ కి మాత్రం ఈ సారి వరసపెట్టి సినిమాలు రిలీజ్ కి రెడీ అవుతున్నాయి. ఇప్పటికే విశ్వక్ సేన్ ఫీమేల్ రోల్ లో చేస్తున్న లైలా ఫిబ్రవరి 14 కి డేట్ ఫిక్స్ చేసుకుంది. ఈ సినిమాతో పాటు నితిన్ తమ్ముడు సినిమా కూడా ఫిబ్రవరి 14కే వస్తున్నట్టు అనౌన్స్ చేశారు. అయితే 2024 క్రిస్మస్ కి రిలీజ్ అవ్వాల్సిన నితిన్ రాబిన్ హుడ్ మూవీ పోస్ట్ పోన్ అవ్వడంతో ఫిబ్రవరి 14న నితిన్ ది ఏ సినిమా రిలీజ్ అవుతుందో అన్న డైలమా కంటిన్యూ అవుతోంది.

మార్చి ఎండింగ్ నుంచి అసలు సిసలు సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. ఈ సారి సమ్మర్ స్టార్ హీరోల సినిమాల రిలీజ్ తో మోత మోగిపోబోతోంది. 2024లో సమ్మర్ బాకీ మొత్తాన్ని 2025 వడ్డీతో సహా తీర్చెయ్యబోతోంది టాలీవుడ్. సినిమాలకు బిగ్గెస్ట్ సీజన్ అయిన సమ్మర్ 2024 సంవత్సరం పెద్దగా సినిమాలు రిలీజ్ చెయ్యకుండా ప్రేక్షకుల్ని డిజప్పాయింట్ చేసింది. కానీ 2025 అలా కాదు చూసినోళ్లకి చూసినన్ని సినిమాలతో వరసపెట్టి బిగ్గెస్ట్ ప్రాజెక్ట్స్ సమ్మర్ లో రిలీజ్ కాబోతున్నాయి.

Also Read : Rajamouli – Ram Charan : చరణ్ ‘గేమ్ ఛేంజర్’ కోసం రాబోతున్న దర్శక ధీరుడు.. రేపే ట్రైలర్ లాంచ్..

ఈ లిస్ట్ లో ఫస్ట్ రాబోతోంది పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ సినిమాలకోసం వెయ్యి కళ్లతో వెయిట్ చేస్తున్న ఫాన్స్ కి మార్చి 28 మెమరబుల్ డే కాబోతోంది. పవన్ కళ్యాణ్ పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ లో 300కోట్లతో తెరకెక్కుతున్న బిగ్గెస్ట్ మూవీ హరిహరవీరమల్లు మీద భారీ అంచనాలు ఉన్నాయి. పాలిటిక్స్ లో బిజీగా ఉన్న పవన్ కోసం వెయిట్ చేస్తున్న ఫాన్స్ కి సమ్మర్ లో సాలిడ్ ఫీస్ట్ ఇవ్వడానికి మార్చి 28న పాన్ ఇండియా వైడ్ గా రిలీజ్ కాబోతోంది హరిహర వీరమల్లు.

మార్చి 28 నే విజయ్ దేవరకొండ, గౌతమ్ తిన్ననూరి కాంబినేషన్లో 100కోట్లతో తెరకెక్కుతున్న పవర్ ఫుల్ స్పై యాక్షన్ ఎంటర్టైనర్ కూడా రిలీజ్ కాబోతోంది. హరిహర వీరమల్లు మార్చి 28నే రిలీజ్ అవుతుంది కాబట్టి విజయ్ సినిమా పోస్ట్ పోన్ అయ్యే చాన్సుంది. సీనియర్ స్టార్ చిరంజీవి కూడా విశ్వంభర సినిమాని మార్చిలో రిలీజ్ చేస్తామని అనౌన్స్ చేసారు. 150 కోట్ల బడ్జెజ్ తో తెరకెక్కుతున్న విశ్వంభర గ్రాండ్ విజువల్స్ తో రానుంది.

ప్రభాస్ సినిమాకి సీజన్ తో పనిలేదు. ఆఫ్ సీజన్ లో అయినా ప్రభాస్ సినిమాల కలెక్షన్లకి లోటుండదు. అలాంటిది సమ్మర్ లో ప్రభాస్ సినిమా రిలీజ్ అయితే ఇక రికార్డులు బద్దలవ్వాల్సిందే. వరసగా యాక్షన్ సినిమాలు చేస్తున్న ప్రభాస్ జస్ట్ ఫర్ ఎ చేంజ్ హార్రర్ కామెడీ ఎంటర్టైనర్ గా రాజాసాబ్ మూవీ చేస్తున్నారు. మారుతి, ప్రభాస్ కాంబినేషన్లో 300కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా ఏప్రిల్ 10న రిలీజ్ కాబోతోంది.

ఏప్రిల్ 10న ప్రభాస్ రాజాసాబ్ రిలీజ్ అవుతున్నా కూడా సిద్దు జొన్నలగడ్డ సినిమా జాక్ అదేరోజు రిలీజ్ డేట్ ఇచ్చేసింది. ఏప్రిల్ 18న అనుష్క , క్రిష్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఘాటి, తేజసజ్జా హీరోగా తెరకెక్కుతున్న మిరాయ్ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. వీటితో పాటు మంచు విష్ణు భారీ గా తీస్తున్న కన్నప్ప ఏప్రిల్ 25న రిలీజ్ డేట్ ఇచ్చింది.

Also See : Mega Cousins : అడవిలో న్యూ ఇయర్ వెకేషన్ ఎంజాయ్ చేస్తున్న ‘మెగా’ కజిన్స్..

మిడ్ సమ్మర్ మే కూడా ఈ సారి సినిమాలు ఫుల్ గా ఉన్నాయి. వాటిలో మే ఫస్ట్ న నాని హిట్ 3 సినిమా రిలీజ్ అవుతోంది. బ్యాక్ టూ బ్యాక్ సక్సెస్ లో ఉన్న నాని యాక్షన్ ఎంటర్టైనర్ గా హిట్ 3 రిలీజ్ కాబోతోంది. 2025 సంక్రాంతి బరి నుంచి తప్పుకుని షిఫ్ట్ అయిన రవితేజ మాస్ జాతర మూవీ కూడా మే 9వ తేదీ రిలీజ్ అవుతోంది. వరసగా ఫ్లాపుల్లో ఉన్న రవితేజకి ఇది 75వ సినిమా.

తెలుగుతో పాటు తమిళ్ హీరోలు కూడా సమ్మర్ ని గట్టిగానే బ్లాక్ చేసుకుంటున్నారు. ఇప్పటికే సూర్య, పూజాహెగ్డే లీడ్ రోల్స్ లో చేస్తున్న రెట్రో మూవీని సమ్మర్ కి రిలీజ్ చేస్తున్నట్టు అనౌన్స్ చేసారు. వీటితో పాటు రజనీకాంత్ , లోకేశ్ కనగరాజ్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న కూలీ సినిమా కూడా సమ్మర్ లోనే రిలీజ్ చేద్దామన్న ప్లాన్ నడుస్తోంది. ఇలా 2025 ఫస్ట్ 6 నెలల్లో క్రేజీ కంటెంట్ తో పవన్ కళ్యాణ్, చరణ్, ప్రభాస్, చిరంజీవి లాటి స్టార్ హీరోలతో సాలిడ్ ఎంటర్టైన్మెంట్ రాబోతోంది.

జూన్ లో కమల్ హాసన్ థగ్ లైఫ్ సినిమా రానుంది. 2025 లో లాస్ట్ 6 నెలలు కూడా సాలిడ్ సినిమాలు ఎంటర్టైనర్ చెయ్యడానికి రెడీ అవుతున్నాయి. ఫస్ట్ హాఫే కాకుండా సెకండాఫ్ కూడా పెద్ద హీరోల సినిమాలతో ఎంగేజ్ చెయ్యబోతున్నారు మేకర్స్.

జులై, ఆగస్ట్ లో రిలీజ్ అవ్వాల్సిన సినిమాలు ఇప్పటి వరకూ అఫీషియల్ గా అనౌన్స్ చెయ్యకపోయినా శర్వానంద్, రామ్, కళ్యాణ్ రామ్ దగ్గరనుంచి చాలా మంది మిడ్ రేంజ్ హీరోలు ఈ రెండు నెలల్ని ఆక్యుపై చెయ్యడం గ్యారంటీ. అయితే సెప్టెంబర్ దసరా సీజన్ నుంచి మళ్లీ సినిమాల రిలీజ్ లు స్పీడందుకోబోతున్నాయి. సెప్టెంబర్ 25న మోస్ట్ వెయిటింగ్ మూవీ అఖండ 2 థియేటర్లోకొస్తోంది. బాలకృష్ణ, బోయపాటి కాంబినేషన్లో ఎన్నో అంచనాలతో ఈ సినిమా తెరకెక్కుతుంది. అదే రోజు సాయి దుర్గా తేజ్ హీరోగా తెరకెక్కుతున్న సంబరాలఏటిగట్టు కూడా రిలీజ్ డేట్ అనౌన్స్ చేసింది. సాయిధరమ్ తేజ్ కెరీర్ లో 100కోట్లకు పైగా బడ్జెట్ తో భారీగా తెరకెక్కుతున్న ఈ సినిమా మీద హై హోప్స్ పెట్టుకున్నాడు సాయి దుర్గా తేజ్.

Also Read : CM Chandrababu : సినీ పరిశ్రమపై సీఎం చంద్రబాబు కామెంట్స్.. సినీ పరిశ్రమకు హబ్ హైదరాబాద్..

తెలుగు సినిమాలు కాకపోయినా అక్టోబర్ లో రెండు ఇంట్రస్టింగ్ సౌత్ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ఒకటి తమిళ్, ఒకటి కన్నడ. ఈ రెండు సినిమాలు పాన్ ఇండియా వైడ్ గా రిలీజ్అవుతున్నాయి. అక్టోబర్ 2న రిషబ్ శెట్టి హీరోగా కాంతార కి ప్రీక్వెల్ మూవీ రిలీజ్ అవ్వబోతోంది. తమిళ్ స్టార్ హీరో విజయ్ లాస్ట్ సినిమాగా తెరకెక్కుతున్న విజయ్ 69 మూవీ అక్టోబర్ 25న రిలీజ్ కి రెడీ అవుతోంది. నవంబర్, డిసెంబర్ సినిమాలైతే ఇంకా ఏవి అధికారికంగా అనౌన్స్ చేయలేదు. ఇవి మెయిన్ హీరోల సినిమాలే ఇవి కాకుండా వారానికి ఒకటి రెండు చిన్న సినిమాలు ఉంటూనే ఉంటాయి.