కటింగ్ చేస్తా ఆగరా కన్నా.. చిన్న సైఫ్ మాటవినడం లేదు!
సైఫ్ అలీ ఖాన్, తైమూర్‌కి హెయిర్ కట్ చేస్తున్న పిక్ కరీనా షేర్ చేసింది..

సైఫ్ అలీ ఖాన్, తైమూర్‌కి హెయిర్ కట్ చేస్తున్న పిక్ కరీనా షేర్ చేసింది..
లాక్‌డౌన్ వేళ అందరూ ఇళ్లకే పరిమితమయ్యారు. సామాన్యులు టీవీలు, ఓటీటీలతో కాలక్షేపం చేస్తుంటే, సెలబ్స్ తమ రోజువారీ పనుల తాలుకు పిక్స్, వీడియోలు పోస్ట్ చేస్తూ ప్రేక్షకులతో టచ్‌లో ఉన్నారు. కొత్తగా Throwback Pics పేరుతో వారికి సంబంధించిన ఓల్డ్ పిక్స్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. లేటెస్ట్‌గా బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ తన ముద్దుల తనయుడు తైమూర్‌కి హెయిర్ కట్ చేస్తున్న పిక్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. తైమూర్‌కి సైఫ్ హెయిర్ కట్ చేయడానికి ప్రయత్నించగా అసలు మాటవినలేదట.
సైఫ్ హెయిర్ కట్ చేయడానికి విశ్వప్రయత్నాలు చేస్తున్న ఫొటోను కరీనా క్యాప్చర్ చేసి ‘Haircut anyone?’ అంటూ ఇన్‌స్టాలో షేర్ చేసింది. తైమూర్ భలే క్యూట్‌గా ఉన్నాడంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఇంతకుముందు Anushka Sharma-Virat Kohli, Cristiano Ronaldo-Georgina Rodriguez మరియు Rajkummar Rao-Patralekha వంటి సెలబ్స్ తర్వాత ఈ హెయిర్ కట్ లిస్టులో సైఫ్ కూడా చేరిపోయాడు.