National Film Awards 2023 : 69వ నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ ప్రకటన.. విజేతలు వీరే..
ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో టెక్నీషియన్స్ అండ్ యాక్టర్స్ ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ 2023 విజేతల లిస్ట్ వచ్చేసింది.

69 National Film Awards 2023 announced
National Film Awards 2023 : 69వ జాతీయ చలనచిత్ర అవార్డుల విజేతల లిస్ట్ వచ్చేసింది. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో టెక్నీషియన్స్ అండ్ యాక్టర్స్ ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే అవార్డులు భారతీయ ప్రభుత్వం అందించే ఈ పురస్కారం. ఇక ఈ ఏడాది విజేతలుగా నిలిచిన వారి లిస్ట్ ని కేంద్ర సమాచార మరియు ప్రసార మంత్రిత్వ శాఖ ప్రకటించింది. 2021 లో సెన్సార్ అందుకున్న సినిమాలు 69వ నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ బరిలో నిలిచాయి. వాటిలో పుష్ప ది రైజ్ (Pushpa The Rise), జై భీమ్, మిన్నల్ మురళి, 83, సర్దార్ ఉదం, మిన్నల్ మురళి, షేర్షా, ది గ్రేట్ ఇండియన్ కిచెన్, నాయట్టు మరియు గంగూబాయి కతియావాడి వంటి చిత్రాలు అవార్డుల కోసం పోటీలో ఉన్నాయి.
వీటిలో విజేతలుగా నిలిచిన చిత్రాలు, నటులు, టెక్నీషియన్స్ వీరే..
– ఉత్తమ చిత్రం ఉప్పెన
– ఉత్తమ నటుడు అల్లు అర్జున్ (పుష్ప)
– ఉత్తమ నటి అలియా భట్ (గంగూభాయి కాఠియావాడి), కృతిసనన్ (మిమీ)
– ఉత్తమ ప్లే బ్యాక్ సింగర్ కాలభైరవ (కొమురంభీముడో..)
– బెస్ట్ స్పెషల్ ఎఫెక్ట్స్ (వి శ్రీనివాస్ మోహన్) ఆర్ఆర్ఆర్
– ఉత్తమ కొరియోగ్రఫీ ఆర్ఆర్ఆర్ (ప్రేమ్ రక్షిత్)
– ఉత్తమ మ్యూజిక్ డైరెక్టర్ దేవీ శ్రీ ప్రసాద్ (పుష్ప)
– ఉత్తమ మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కీరవాణి (ఆర్ఆర్ఆర్)
– ఉత్తమ లిరిక్స్ కొండపొలం (చంద్రబోస్)
– ఉత్తమ యాక్షన్ డైరెక్షన్ అవార్డ్ (స్టంట్ కొరియోగ్రఫీ) కింగ్ సోలమన్
– అత్యంత ప్రజాదరణ పొందిన చిత్రం (ఆర్ఆర్ఆర్)
– క్రిటిక్స్ స్పెషల్ మెన్షన్ ఫిల్మ్ సుబ్రమణ్య బాదూర్ (కన్నడ)
– ఉత్తమ ఫిల్మ్ క్రిటిక్ పురుషోత్తమ చార్యులు (తెలుగు)
– ఉత్తమ బుక్ ఆన్ సినిమా ది ఇన్క్రీడిబుల్ మెలోడియస్ జర్నీ (రచయిత రాజీవ్ విజయకర్)
– ఉత్తమ చిత్రం రాకెట్రీ ది నంబీ ఎఫెక్ట్ (హిందీ)
– ఉత్తమ సహాయ నటి పల్లవి జోషి (ది కశ్మీర్ ఫైల్స్)
– ఉత్తమ సహాయ నటుడు పంకజ్ త్రిపాఠి(మిమి-హిందీ)
– ఉత్తమ దర్శకుడు నిఖిళ్ మహాజన్ (గోదావరి-మరాఠీ)
– ఉత్తమ స్ర్కీన్ ప్లే నాయట్టు (మలయాళం)
– ఉత్తమ సంభాషణలు గంగూబాయి కాఠియావాడి(హిందీ)
– ఉత్తమ సినిమాటోగ్రఫీ సర్దార్ ఉద్దమ్ (ఈవిక్ ముఖోపాధ్యాయ)
– ఉత్తమ నేపథ్య గాయని శ్రేయ ఘోషల్ (ఇరివిన్ నిజాల్- మాయావా ఛాయావా)
– ఉత్తమ బాల నటుడు భావిన్ రబారి(ఛల్లో షో – గంగూలీ)