పవర్ స్టార్ ‘గ‌బ్బ‌ర్ సింగ్’ ఏడేళ్లు పూర్తి

పవన్ కెరియ‌ర్‌కి మంచి బూస్ట‌ప్ ఇచ్చిన చిత్రం గ‌బ్బ‌ర్ సింగ్. నాక్కొంచెం తిక్కుంది, కాని దానికో లెక్కుంది అంటూ పవన్ చెప్పిన డైలాగ్ తో ఈ సినిమా బాక్సాఫీస్ ని షేక్ చేసింది.

  • Published By: veegamteam ,Published On : May 11, 2019 / 07:15 AM IST
పవర్ స్టార్ ‘గ‌బ్బ‌ర్ సింగ్’ ఏడేళ్లు పూర్తి

Updated On : May 11, 2019 / 7:15 AM IST

పవన్ కెరియ‌ర్‌కి మంచి బూస్ట‌ప్ ఇచ్చిన చిత్రం గ‌బ్బ‌ర్ సింగ్. నాక్కొంచెం తిక్కుంది, కాని దానికో లెక్కుంది అంటూ పవన్ చెప్పిన డైలాగ్ తో ఈ సినిమా బాక్సాఫీస్ ని షేక్ చేసింది.

పవన్ కెరియ‌ర్‌కి మంచి బూస్ట‌ప్ ఇచ్చిన చిత్రం గ‌బ్బ‌ర్ సింగ్. “నాక్కొంచెం తిక్కుంది, కాని దానికో లెక్కుంది” అంటూ పవన్ చెప్పిన డైలాగ్ తో ఈ సినిమా బాక్సాఫీస్ ని షేక్ చేసింది. ఈ చిత్రాన్ని హ‌రీష్ శంక‌ర్ కామెడీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెర‌కెక్కించారు.

ఇందులో ప‌వన్ క‌ళ్యాణ్ గబ్బ‌ర్ సింగ్ గ్యాంగ్‌తో చేసే కామెడీ సినిమాకే హైలైట్ అని చెప్ప‌ుకోవ‌చ్చు. అంతేకాదు పవన్ కళ్యాణ్, శృతి హాసన్ క‌ల‌సి నటించిన తొలి చిత్రమిదే. ఆ తర్వాత వీరిద్దరూ కలిసి ‘కాట‌మరాయుడు’లో మరోసారి జంటగా అలరించారు. మే 11, 2012న విడుద‌లైన ఈ చిత్రం విడుద‌లై ఈ రోజుకి ఏడేళ్ళు అవుతుంది.

ఈ సంద‌ర్భంగా ద‌ర్శ‌కుడు హ‌రీష్ శంకర్ త‌న ట్విట్ట‌ర్‌లో పాత జ్ఞాప‌కాలు గుర్తు చేసుకున్నారు. నా వెన్ను తట్టి , నా వెనకాలే ఉండి , సదా నా విజయం కోరుకునే.. నా గబ్బర్ సింగ్‌కి మరోసారి ధన్యవాదాలు చెబుతూ.. ఏడేళ్ళ గ‌బ్బ‌ర్ సింగ్ అని పేర్కొన్నారు.

సినిమా లోకేష‌న్‌కి సంబంధించిన ఫోటోల‌ని కూడా హ‌రీష్ శంక‌ర్ షేర్ చేశారు. ఇకప్ర‌స్తుతం హ‌రీష్ శంక‌ర్ వాల్మీకి అనే చిత్రంతో బిజీగా ఉన్నాడు. త‌మిళ చిత్రం జిగ‌ర్తాండ‌కి రీమేక్‌గా తెర‌కెక్కుతున్న ఈ చిత్రంలో వ‌రుణ్ తేజ్‌, పూజా హెగ్డే ప్ర‌ధాన పాత్ర‌లు పోషిస్తున్నారు.