Sridevi : శ్రీదేవి.. ది లైఫ్ అఫ్ ఏ లెజెండ్.. శ్రీదేవిపై మరో పుస్తకం..
శ్రీదేవిపై ఇప్పటికే పలు పుస్తకాలు వచ్చాయి. ఇప్పుడు ఆమె బయోగ్రఫీ మొత్తం ఓ పుస్తకంగా రాబోతుంది. శ్రీదేవి, బోనీకపూర్ లకి సన్నిహితుడు, ప్రముఖ రచయిత, జర్నలిస్ట్ ధీరజ్ కుమార్ శ్రీదేవికి సంబంధించి అన్ని అంశాలతో కూడిన ఓ పుస్తకాన్ని..................

A book will coming soon on Sridevi by Dheeraj Kumar
Sridevi : అతిలోక సుందరి, ఎన్నో కోట్ల మందికి అభిమాన దేవత శ్రీదేవి ఎన్నో సినిమాలతో భారతదేశ ప్రేక్షకులని మెప్పించి హఠాత్తుగా 2018లో అందరికి దూరమయింది. చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ మొదలుపెట్టి తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ సినిమాల్లో స్టార్ హీరోలందరి సరసన నటించి స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. 1996లో అనూహ్యంగా బాలీవుడ్ నిర్మాత బోనీకపూర్ ని పెళ్లి చేసుకొని సినిమాలకి దూరమైంది. ఆ తర్వాత కొన్ని సినిమాల్లో గెస్ట్ అప్పీరెన్స్ ఇచ్చి 2012 లో మళ్ళీ పూర్తి స్థాయిలో ఇంగ్లీష్ వింగ్లిష్ సినిమాతో కంబ్యాక్ ఇచ్చింది శ్రీదేవి అనంతరం మామ్ అనే మరో సినిమా తీసింది. అదే ఆమె చివరి సినిమాగా మిగిలింది. దాదాపు 50 ఏళ్ళ సినీ కెరీర్ లో 300కి పైగా సినిమాల్లో నటించి భారత దేశ ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకుంది.
శ్రీదేవి 2018లో హఠాత్తుగా మరణించడంతో ఆమె మరణం అందర్నీ తీవ్రంగా కలిచివేసింది. ఆమె మరణానంతరం ఆమె కథని బయోపిక్ తీయాలని ప్రయత్నించారు కానీ కుదరలేదు. ఇక శ్రీదేవిపై ఇప్పటికే పలు పుస్తకాలు వచ్చాయి. ఇప్పుడు ఆమె బయోగ్రఫీ మొత్తం ఓ పుస్తకంగా రాబోతుంది. శ్రీదేవి, బోనీకపూర్ లకి సన్నిహితుడు, ప్రముఖ రచయిత, జర్నలిస్ట్ ధీరజ్ కుమార్ శ్రీదేవికి సంబంధించి అన్ని అంశాలతో కూడిన ఓ పుస్తకాన్ని రాశారు. ఈ పుస్తకం వెస్ట్‌ల్యాండ్ బుక్ సంస్థ 2023 లోనే విడుదల చేయనుంది. తాజాగా బోనీకపూర్ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించాడు.
Ram Charan : రామ్‌చరణ్ నటనకి ఫ్యాన్ అయ్యాను.. శివరాజ్ కుమార్!
శ్రీదేవి బయోగ్రఫీని.. శ్రీదేవి..ది లైఫ్ ఆఫ్ ఎ లెజెండ్ అనే పేరుతో పుస్తకంగా ప్రచురించబోతున్నారు. ఈ పుస్తకంలో శ్రీదేవికి సంబంధించి పూర్తి సమాచారం ఉంటుందని బోనీకపూర్ తెలిపారు. దీంతో శ్రీదేవి అభిమానులు ఈ పుస్తకం ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నారు. ఇక శ్రీదేవి బయోపిక్ నిర్మించాలని ప్రయత్నాలు ఇప్పటికి కొంతమంది చేస్తున్నారు. మరి ఆమె జీవిత కథ సినిమాగా ఎప్పుడు తెరకెక్కుతుందో చూడాలి. శ్రీదేవి పెద్ద కూతురు జాన్వీ కపూర్ ఇప్పటికే హీరోయిన్ గా సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే.
?The biggest announcement
Legendary Actress Sridevi Kapoor biography book will be published later this year. @SrideviBKapoor @BoneyKapoorAuthor of the book @AuthorDhiraj
@WestlandBooks @karthikavk @Blind_glass @LabyrinthAgency @donechannel1 pic.twitter.com/WQi0nuxsHo
— Ramesh Bala (@rameshlaus) February 8, 2023