Salman Khan : సల్మాన్ ఖాన్ బెదిరింపు కేసులో ఓ వ్యక్తి అరెస్ట్..

Salman Khan : సల్మాన్ ఖాన్ బెదిరింపు కేసులో ఓ వ్యక్తి అరెస్ట్..

A man has been arrested in the Salman Khan death threat case

Updated On : November 7, 2024 / 12:31 PM IST

Salman Khan : బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ కి గంత కొంత కాలంగా వరుస బెదిరింపులు వస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా సల్మాన్ ను బెదిరిస్తున్న గ్యాంగ్ నుండి ఓ నిందితుడిని పోలీసులు పట్టుకున్నారు. రాజస్థాన్ కి చెందిన 32 ఏళ్ళ వ్యక్తితో సల్మాన్ కి బెదిరింపులు వస్తున్న కేసు తో సంబంధం ఉందని అన్నారు పోలీసులు. కర్ణాటకలో నిందితుడు పట్టుబడగా మహారాష్ట్ర పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.

అయితే పోలీసుల నుండి అందుతున్న సమాచారం మేరకు ..హవేరి టౌన్ సమీపంలో నిందితుడిని అదుపులోకి తీసుకొని తీసుకున్నారట. ఓ ప్రముఖ న్యూస్ ఛానల్ చూసి పోలీస్ స్టేషన్ కి ఫోన్ చేసి సల్మాన్ గురించి హత్యా బెదిరింపులు చేసాడట. ఇక ఇదే విషయాన్ని అతన్ని అడిగితే తను రోజూవారి కూలి చేసుకొని బతికేవాడని, తను బిష్ణోయ్ అభిమాని అని చెప్పాడు.

Also Read : Matka : వరుణ్ తేజ్ ‘మట్కా’ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఫిక్స్.. చీఫ్ గెస్ట్ ఆయనేనా..

కాగా ఈ విషయం గురించి తదుపరి చర్యలు తీసుకుంటామని, ఇంటరాగేషన్ చేస్తామని, నిజానిజాలు రాబడతామని పోలీసులు తెలిపినట్టు తెలుస్తుంది. అనంతరం నిందితుడిని ముంబై పోలీసులకి అప్పగించినట్టు తెలిపారు మహారాష్ట్ర పోలీసులు.