Aadavallu Meeku Joharlu: టైటిల్ సాంగ్ రిలీజ్.. దేవిశ్రీ మార్క్ కిర్రాక్ అంతే!

చాలాకాలంగా హిట్ కోసం ఎదురుచూస్తున్న శర్వానంద్, లక్కీ స్టార్ గా చేసిన ప్రతి సినిమా బ్లాక్ బస్టర్ హిట్స్ కొడుతూ దూసుకెళ్తున్న రష్మిక మందన్న హీరోహీరోయిన్లుగా..

Aadavallu Meeku Joharlu: టైటిల్ సాంగ్ రిలీజ్.. దేవిశ్రీ మార్క్ కిర్రాక్ అంతే!

Aadavallu Meeku Joharlu

Updated On : February 4, 2022 / 5:05 PM IST

Aadavallu Meeku Joharlu: చాలాకాలంగా హిట్ కోసం ఎదురుచూస్తున్న శర్వానంద్, లక్కీ స్టార్ గా చేసిన ప్రతి సినిమా బ్లాక్ బస్టర్ హిట్స్ కొడుతూ దూసుకెళ్తున్న రష్మిక మందన్న హీరోహీరోయిన్లుగా తిరుమల కిషోర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఆడవాళ్ళు మీకు జోహార్లు. ప్రస్తుతం ఒక్క పాట మినహా షూటింగ్ కంప్లీట్ చేసుకొని, మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటుంది.

Allu Arjun: బన్నీ కొత్త యాడ్.. మొన్న బస్ ఎక్కమని.. నేడు తినమని!

ఈ సినిమాని ఫిబ్రవరి 25న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు మేకర్స్ ఇటీవలే ప్రకటించగా.. ప్రమోషన్స్ స్పీడ్ పెంచిన యూనిట్ తాజాగా టైటిల్ సాంగ్ రిలీజ్ చేశారు. రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ స్వరపరిచిన ఆడవాళ్లు మీకు జోహార్లు.. అంటూ సాగే టైటిల్ సాంగ్ లో తన జీవితం అలా మారిపోయేలా కారణమైన ఆడవాళ్ల అందరి మీదున్న ఫ్రస్ట్రేషన్‌ను హీరో ఈ పాటలో చూపించారు.

Aadavaallu Meeku Joharlu: లక్కీ గర్ల్ రష్మిక.. శర్వాకి లక్ కలిసి వస్తుందా?

తన పెళ్లి కాకపోవడానికి కూడా వారే కారణమంటూ నిందిస్తున్నట్టు కనిపిస్తోంది. శ్రీమణి రాసిన సాహిత్యం, దేవీ శ్రీ ప్రసాద్ గానం చక్కగా కుదిరింది. ఈ పాటలో శర్వానంద్ మాస్ స్టెప్పులు వేసినట్టు కనిపిస్తోంది. రష్మిక కూడా హీరోతో కలిసి కాలు కదిపింది. ఈ సినిమా మ్యూజికల్ ప్రమోషన్స్‌ను టైటిల్ సాంగ్‌తో ప్రారంభించడం మంచి చాయిస్‌లా కనిపిస్తోండగా.. ఈ పాట అయితే దేవిశ్రీ ప్రసాద్ మార్క్ కిర్రాక్ గా కనిపిస్తుంది.