రచ్చ రచ్చ.. నవ్వులే నవ్వులు.. అంతలోనే సీరియస్.. ఆదిని సిగ్గుందా? అని అడిగిన బిగ్‌బాస్ కంటెస్టెంట్!

ప్రతి సంవత్సరం కొత్త ఏడాది కోసం మల్లెమాల ఎంటర్‌టైన్‌మెంట్ ప్రత్యేకంగా షోలను నిర్వహిస్తూ ఉంటుంది. తెలుగు టెలివిజన్‌లో క్రేజీ షోగా ఉన్న ‘జబర్ధస్త్’ నటులతో ఈ కార్యక్రమం చేసి డిసెంబర్ 31వ తేదీ రాత్రి షోని ప్రసారం చేస్తుంటారు. జబర్ధస్త్‌లో హిట్ అయిన అందరినీ ఈ షోలో పెడుతారు నిర్వాహకులు. అయితే ఈసారి షోలో జబర్ధస్త్ నటులతో పాటు.. బిగ్ బాస్ షో ద్వారా క్రేజ్ తెచ్చుకున్న సెలబ్రిటీలను కూడా ఈ షోకి రప్పించారు.
ఈ కార్యక్రమంకు సంబంధించిన ప్రోమోని లేటెస్ట్‌గా చిత్రయూనిట్ విడుదల చేసింది. అందులో ముఖ్యంగా జబర్ధస్త్ ద్వారా పరిచయం అయిన యంగ్ టాలెంటెడ్ ఆర్టిస్ట్ హైపర్ ఆదికి సంంబంధించిన స్కిట్‌ని, బిగ్ బాస్ కంటెస్టెంట్ జాఫర్ ఇంటర్వ్యూని ఇందులో ప్రత్యేకంగా పెట్టారు. గుక్క తిప్పకుండా పంచులు వేస్తూ కడుపుబ్బా నవ్వించే హైపర్ ఆదిరకి బిగ్ బాస్ కంటెస్టెంట్ జాఫర్ నీళ్లు తాగించే ప్రశ్నలు వేశాడు. నీకు అసలు సిగ్గుందా? అంటూ ప్రశ్నలు వేశాడు. దీనికి సంబంధించిన ప్రోమో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
జబర్ధస్త్‌లో వచ్చే స్కిట్లు, సినిమాల్లో డైలాగులు మాత్రమే కాదు.. హైపర్ ఆది స్పెషల్ షోలకు కూడా స్క్రిప్టు రాస్తుంటాడు. పండుగలకు, ప్రత్యేక రోజులకు మల్లెమాల వాళ్లు షోలు ప్రసారం చేస్తుంటారు. వీటిలో జబర్ధస్త్ కమెడియన్లతో పాటు ఎంతో మంది సెలెబ్రిటీలను కూడా తీసుకు వస్తుంటారు. ఈ షోలు భారీగా టీఆర్పీలను సొంతం చేసుకుంటుంటాయి.
ప్రతి ఏడాది న్యూ ఇయర్ సంధర్భంగా చేసే ప్రోగ్రామ్ మాదిరిగా ఈ ఏడాది ‘ఆడువారి పార్టీలకు అర్థాలే వేరులే’ అనే టైటిల్‌తో షో చేశారు నిర్వాహకులు. ఈ కార్యక్రమంలో రోజా, జానీ మాస్టర్ రెండు గ్రూపులుగా ఏర్పడ్డాయి. అందులో ఆది, శ్రీను, రాం ప్రసాద్, సుధీర్, విష్ణు ప్రియ, వర్షిణి, భాను సహా ఎంతోమంది ఉన్నారు. ఈ వీడియో నవ్వులు.. సీరియస్ అన్నీ కలగలిపి చాలా బాగుంది. మీరు కూడా ఒకసారి చూసి నవ్వేసుకోండి.