హ్యాపీ బర్త్‌డే సూర్య.. ఆకట్టుకుంటున్న ‘కాటుక కనులే’..

  • Published By: sekhar ,Published On : July 23, 2020 / 02:30 PM IST
హ్యాపీ బర్త్‌డే సూర్య.. ఆకట్టుకుంటున్న ‘కాటుక కనులే’..

Updated On : July 23, 2020 / 2:57 PM IST

తమిళ్‌తో పాటు తెలుగులోనూ తనకంటూ ఓ ప్రత్యేకమైన్ ఇమేజ్ తెచ్చుకున్నారు స్టార్ హీరో సూర్య. ‘గురు‘ ఫేం సుధ కొంగర దర్శకత్వంలో సూర్య నటించిన ‘సూరరై పోట్రు’- ‘ఆకాశం నీ హద్దురా!’ చిత్రం విడుదలకు రెడీ అయింది. అపర్ణ బాలమురళి కథానాయిక కాగా డా.మోహన్ బాబు కీలక పాత్రలో నటించారు. ఇప్పటివరకు రిలీజ్ చేసిన పోస్టర్స్, పిల్లపులి పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. జూలై 23 సూర్య పుట్టినరోజు సందర్భంగా మరో వీడియో సాంగ్ ప్రోమో రిలీజ్ చేశారు.యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ జి.వి.ప్రకాష్ కుమార్ ట్యూన్ కంపోజ్ చేయగా భాస్కరభట్ల అద్భుతమైన లిరిక్స్ రాశారు. ధీ చాలా బాగా పాడారు.Soorarao Pottru‘‘కాటుక కనులే మెరిసిపోయే పిలడా నిను చూసి.. మాటలన్నీ మరిచిపోయా నీళ్లే నమిలేసి.. నా కొంగు చివర దాచుకున్న చిల్లరే నువ్వురా.. రాతిరంతా నిదురపోని అల్లరే నీదిరా..’’ అంటూ సాగే ఈ సాంగ్ ప్రోమో ఆకట్టుకుంటుంది. సూర్య, అపర్ణల నేచురల్ యాక్టింగ్, కెమిస్ట్రీతో పాటు నికేత్ బొమ్మి విజువల్స్ కలర్‌ఫుల్‌గా ఉన్నాయి.