హీరో ఆమిర్ ఖాన్ ఇంటికి బస్సులో 25 మంది ఐపీఎస్ అధికారులు ఎందుకు వచ్చారు? క్లారిటీ వచ్చేసింది..

ఆమిర్ ఖాన్ ఏదైనా సెక్యూరిటీ బేస్డ్ ప్రాజెక్ట్ మీద పని చేస్తున్నారా? అన్న ఊహాగానాలకు తెరపడింది. 

హీరో ఆమిర్ ఖాన్ ఇంటికి బస్సులో 25 మంది ఐపీఎస్ అధికారులు ఎందుకు వచ్చారు? క్లారిటీ వచ్చేసింది..

Updated On : July 28, 2025 / 9:40 PM IST

బాంద్రాలోని బాలీవుడ్ సూపర్ స్టార్ ఆమిర్ ఖాన్ నివాసం వద్ద భారీ సంఖ్యలో పోలీస్ వాహనాలు బయటకు వస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ వీడియోలో సుమారు 25 మంది ఐపీఎస్ అధికారులు ఆయన ఇంటి నుంచి బయటకు వస్తున్నట్లు కనపడింది.

ఈ నేపథ్యంలో ఆమిర్ ఖాన్ టీమ్ నుంచి అధికారిక ప్రకటన వెలువడింది. “ప్రస్తుతం ట్రైనింగ్‌లో ఉన్న ఐపీఎస్ అధికారుల బ్యాచ్ ఆమిర్‌ ఖాన్‌ను కలవాలనుకుంది. ఆమిర్ ఖాన్ వారిని తన నివాసానికి ఆహ్వానించారు” అని స్పష్టత ఇచ్చింది. దీంతో ఆమిర్ ఖాన్ ఏదైనా సెక్యూరిటీ బేస్డ్ ప్రాజెక్ట్ మీద పని చేస్తున్నారా? అన్న ఊహాగానాలకు తెరపడింది.

ఇది కొత్తేం కాదు..
గతంలోనూ ఆమిర్ ఖాన్ పలుసార్లు ఐపీఎస్‌ ట్రెయినీలతో సమావేశమయ్యారు. 1999లో విడుదలైన ‘సర్ఫరోష్’ సినిమాలో నిజాయితీగల, తెలివైన పోలీస్ అధికారిగా ఆయన చేసిన పాత్ర నేటికీ యువ అధికారులకి ప్రేరణగా నిలుస్తోంది. అందుకే తరచూ IPS ట్రెయినీలు అతనిని కలవడానికి ఆసక్తి చూపుతుంటారు.

ఆమిర్ తదుపరి ప్రాజెక్టులు ఇవే..
వృత్తిపరంగా చూస్తే ఆమిర్ ఖాన్ ఇటీవల ‘సితారే జమీన్ పర’ సినిమాతో బిగ్ స్క్రీన్‌పై రీ ఎంట్రీ ఇచ్చారు. ఈ మూవీ దాదాపు రూ.165 కోట్లు కలెక్షన్లు రాబట్టింది. త్వత్వరలో ఆమిర్ ఖాన్ ప్రొడక్షన్స్ నుంచి కొత్త ప్రాజెక్టులపై అధికారిక ప్రకటనలు వెలువడే అవకాశం ఉంది.

రజనీకాంత్‌తో కలిసి ఆమిర్ ఖాన్ ‘కూలీ’ సినిమాలో నటిస్తున్నారు. అంతేకాదు, డైరెక్టర్ లోకేశ్ కనకరాజ్‌తో మరో కొత్త ప్రాజెక్ట్‌పై కూడా ఆమిర్ ఖాన్ పని చేస్తున్నారు. ఆమిర్ ఖాన్ ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మెల్బోర్న్ (IFFM) 2025 చీఫ్ గెస్ట్‌గా పాల్గొనబోతున్నారు. ఆగస్టు 14 నుంచి 24 వరకు ఈ ఫెస్టివల్‌ జరగనుంది. ఇందులో ‘సితారే జమీన్ పర’ చిత్రాన్ని ప్రత్యేకంగా ప్రదర్శించనున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)