Aamir Khan: అమీర్ ఖాన్ తల్లికి గుండెపోటు.. ఆసుపత్రిలో అమీర్!

బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ తల్లి జీనత్ గుండెపోటుకు గురయ్యినట్లు తెలుస్తుంది. ఆమె ముంబై పంచగనిలో నివాసం ఉంటున్నారు. ఇటీవల దీపావళి సందర్భంగా తల్లి ఇంటిలో అమీర్ తన కుటుంబ సభ్యులతో కలిసి పండుగ జరుపుకున్నారు. ఆ సమయంలో ఆమెకు హఠాత్తుగా ఛాతిలో నొప్పి వచ్చి కుప్పకూలిపోయినట్లు సమాచారం.

Aamir Khan: అమీర్ ఖాన్ తల్లికి గుండెపోటు.. ఆసుపత్రిలో అమీర్!

Aamir Khan's mother suffered a heart attack

Updated On : October 31, 2022 / 1:08 PM IST

Aamir Khan: బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ తల్లి జీనత్ గుండెపోటుకు గురయ్యినట్లు తెలుస్తుంది. ఆమె ముంబై పంచగనిలో నివాసం ఉంటున్నారు. ఇటీవల దీపావళి సందర్భంగా తల్లి ఇంటిలో అమీర్ తన కుటుంబ సభ్యులతో కలిసి పండుగ జరుపుకున్నారు. ఆ సమయంలో ఆమెకు హఠాత్తుగా ఛాతిలో నొప్పి వచ్చి కుప్పకూలిపోయినట్లు సమాచారం.

Aamir Khan : భారీ నష్టాలని మిగిల్చిన ‘లాల్ సింగ్ చడ్డా’.. నిర్మాతల కోసం అమీర్!

దీంతో అమీర్ ఆమెను హుటాహుటిన ముంబైలోని బ్రీచ్ కాండీ ఆసుపత్రికి తరలించాడు. అప్పటి నుండి ఆమె పక్కనే ఉంటూ వస్తున్నాడు. నాలుగు రోజులుగా ట్రీట్మెంట్ అందిస్తున్న వైద్యులు.. “ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగానే ఉంది, చికిత్సకి స్పందిస్తున్నారు” అంటూ తెలిపారు. ఇక అమిర్ ని పరామర్శించడానికి కుటుంబ సభ్యులతో పాటు, ఇండస్ట్రీలోని పలు ప్రముఖులు కూడా హాస్పిటల్ కి చేరుకుంటున్నారు.

అయితే గతంలో అమిర్ ‘కాఫీ విత్ కరణ్‌’ టాక్ షోలో.. సినిమాల వాళ్ళ అతడి తల్లి మరియు కుటుంబంతో తగినంత సమయం గడపకపోవడం, తన అతిపెద్ద పశ్చాత్తాపంలో ఒకటని వెల్లడించిన సంగతి మనకి తెలిసిందే. కాగా ఇప్పుడు అమీర్ ని ఈ పరిస్థితిలో చూసి అభిమానులు ఆందోళన చెందుతున్నారు.