Aamir Khan : భారీ నష్టాలని మిగిల్చిన ‘లాల్ సింగ్ చడ్డా’.. నిర్మాతల కోసం అమీర్!

బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమిర్ ఖాన్ డ్రీమ్ ప్రాజెక్ట్ 'లాల్ సింగ్ చడ్డా' భారీ అంచనాల మధ్య ఇటీవల విడుదలై ఫ్లాప్ టాక్ ని మూటకట్టుకుంది. దాదాపు రూ200కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రం అందులోని సగం డబ్బుని కూడా రాబట్టలేక కేవలం రూ60 కోట్లు మాత్రమే రాబట్టడంతో అమీర్.....

Aamir Khan : భారీ నష్టాలని మిగిల్చిన ‘లాల్ సింగ్ చడ్డా’.. నిర్మాతల కోసం అమీర్!

Aamir Khan wants to return his remuneration for 'Lal Singh Chaddha' Losses..

Aamir Khan : బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ డ్రీమ్ ప్రాజెక్ట్ ‘లాల్ సింగ్ చడ్డా’ భారీ అంచనాల మధ్య ఇటీవల విడుదలై ఫ్లాప్ టాక్ ని మూటకట్టుకుంది. అయితే ఈ చిత్రం 1994లో వచ్చిన హాలీవుడ్ సినిమా ఫారెస్ట్ గంప్ కి రీమేక్ గా తెరకెక్కింది. ఇందులో టాలీవుడ్ హీరో అక్కినేని నాగ చైతన్య ఒక కీలక పాత్రలో మెరవగా 3ఏళ్ళ తరవాత మళ్ళీ కరీనా అమీర్ కి జంటగా నటించింది. ఇక ఈ సినిమాని తెలుగులో చిరంజీవి సమర్పించి ప్రమోషన్స్ లో కూడా పాల్గోన్నాడు.

Aamir khan : సౌత్ సినిమాలు బాగా ఆడుతున్నాయి.. అందుకే నా సినిమాకి చిరంజీవిని హెల్ప్ అడిగాను..

అసలే బాలీవుడ్ లో బాయ్ కాట్ ట్రెండ్ నడవడం, దేశాన్ని వ్యతిరేకిస్తూ మాట్లాడాడని అమీర్ పై ఆరోపణలు ఉండడంతో ఈ బాయ్ కాట్ అంశానికి ఆజ్యం పోసినట్లు అయింది. దాదాపు రూ200కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రం అందులోని సగం డబ్బుని కూడా రాబట్టలేకపోయింది అంటే సినిమాపై ఎంతటి వ్యతిరేకత వచ్చిందో అర్థమైతుంది. సినిమా కూడా కొంచెం స్లోగా నడవడం, మతిస్థిమితం లేని యువకుడిని ఇండియన్ ఆర్మీలో చూపించడం లాంటి అంశాలు కూడా సినిమా ఫెయిల్యూర్ కి కారణమని చెప్పవచ్చు.

Aamir Khan : నా సినిమాని బాయ్‌కాట్‌ చేయకండి.. ప్లీజ్..

లాల్ సింగ్ చడ్డా ఫుల్ రన్ లో రూ60 కోట్లు మాత్రమే రాబట్టడంతో అమీర్ తన రెమ్యూనరేషన్ ని నిర్మాతల నష్టం పూడ్చడానికి తిరిగి ఇవ్వాలని నిర్ణయించుకున్నాడట. అయితే అమీర్ ఈ సినిమాకు గాను రూ50 కోట్లు పారితోషకం తీసుకున్నట్లు తెలుస్తుంది. అమీర్ మరియు అతడి మాజీ భార్య కిరణ్‌రావ్‌ ఈ సినిమాకు సహ నిర్మాతలుగా వ్యవహరించారు. దీంతో చూసుకుంటే అమీర్ కి మొత్తంగా వంద కోట్ల వరకు నష్టం వాటిల్లినట్టు తెలుస్తుంది. ఏదేమైనా తన డ్రీమ్ ప్రాజెక్ట్ కోసం ఏ సినిమాకి సైన్ చేయకుండా చేసినా అమీర్ కి ఈ సినిమా నిరాశే మిగిలిచింది అని చెప్పాలి.