Aamir khan : సౌత్ సినిమాలు బాగా ఆడుతున్నాయి.. అందుకే నా సినిమాకి చిరంజీవిని హెల్ప్ అడిగాను..

ప్రెస్ మీట్ లో అమీర్ ఖాన్ మాట్లాడుతూ.. ''నా మీద ప్రేమతో తెలుగులో ఈ సినిమాని రిలీజ్ చేయడానికి చిరంజీవి ముందుకొచ్చారు. అది నాకెంతో గౌరవం. నా సినిమాలు గతంలో కూడా తెలుగు, తమిళంలో రిలీజ్ అయ్యాయి కానీ.....

Aamir khan : సౌత్ సినిమాలు బాగా ఆడుతున్నాయి.. అందుకే నా సినిమాకి చిరంజీవిని హెల్ప్ అడిగాను..

Lal Singh Chaddha

Lal Singh Chaddha :  అమీర్ ఖాన్ హీరోగా, నాగ చైతన్య ముఖ్య పాత్రలో నటిస్తున్న సినిమా లాల్ సింగ్ చద్దా. ఫారెస్ట్‌ గంప్‌ సినిమాకి రీమేక్ గా తెరకెక్కిన ఈ సినిమాని పాన్ ఇండియా రిలీజ్ చేస్తున్నారు. ఇటీవల తెలుగు సినిమాలు బాగా హిట్ అవుతుండటంతో బాలీవుడ్ సినిమాలన్నీ తెలుగులో మార్కెట్ కోసం ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. లాల్ సింగ్ చద్దా సినిమాలో నాగ చైతన్య కూడా ఉండటంతో తెలుగులో కూడా ప్రమోషన్స్ భారీగా చేస్తున్నారు. ఈ సినిమాని తెలుగులో మెగాస్టార్ చిరంజీవి రిలీజ్ చేస్తున్నారు. ఆదివారం సాయంత్రం లాల్ సింగ్ చద్దా ప్రెస్ మీట్ జరుగగా దీనికి చిరంజీవి ముఖ్య అతిధిగా వచ్చారు. ఈ ప్రెస్ మీట్ లో చిరంజీవి అమీర్ ఖాన్ గురించి, అతని సినిమాల గురించి గొప్పగా మాట్లాడారు.

Tara Sutaria : హీరోలకి ఇచ్చేంత రెస్పెక్ట్ హీరోయిన్స్ కి ఇవ్వరు..

ఈ ప్రెస్ మీట్ లో అమీర్ ఖాన్ మాట్లాడుతూ.. ”నా మీద ప్రేమతో తెలుగులో ఈ సినిమాని రిలీజ్ చేయడానికి చిరంజీవి ముందుకొచ్చారు. అది నాకెంతో గౌరవం. నా సినిమాలు గతంలో కూడా తెలుగు, తమిళంలో రిలీజ్ అయ్యాయి కానీ చాలా తక్కువ మందికి చేరువయ్యాయి. ఇటీవల సౌత్ సినిమాలు హిందీలో బాగా ఆడుతున్నాయి. అందుకే చిరంజీవిని సాయం కోరాను. లాల్ సింగ్ చద్దా సినిమాని తెలుగులో విడుదల చేసి, మరింత ఎక్కువ మందికి చేరువయ్యేలా చూడమని చిరంజీవిని అడిగాను. ఆయన వెంటనే ఒప్పుకున్నారు. ఈ సినిమా స్క్రిప్ట్‌ రచనకే 8 ఏళ్ల సమయం పట్టింది. ‘ఫారెస్ట్‌ గంప్‌’తో పోలిస్తే ఇందులో చాలా మార్పులు చేశాం. కార్గిల్‌లో నేనూ, నాగచైతన్య కలిసి ఒక నెల రోజులపాటు షూటింగ్ లో పాల్గొన్నాం. ప్రతి రోజూ కార్లో ప్రయాణం చేస్తూ రెండు గంటలు మాట్లాడుకునేవాళ్లం. చైతూ నాకు మంచి స్నేహితుడయ్యాడు” అని తెలిపారు. ఒకప్పుడు మన సినిమాలు బాలీవుడ్ లో రిలీజ్ అవ్వాలి అనుకునే వాళ్ళం కానీ ఇప్పుడు బాలీవుడ్ వాళ్ళే వచ్చి వాళ్ళ సినిమాలు ఇక్కడ రిలీజ్ చేసి చూడమని అడుగుతున్నారు.