10 ఏళ్ల ‘ఆర్య 2’ : బన్నీ ఎమోషనల్ పోస్ట్

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్‌ల కాంబోలో రూపొంది 2009 నవంబర్ 27న విడుదలైన ‘ఆర్య 2’, 2019 నవంబర్ 27 నాటికి 10 సంవత్సరాలు పూర్తి చేసుకుంటుంది..

  • Published By: sekhar ,Published On : November 27, 2019 / 10:50 AM IST
10 ఏళ్ల ‘ఆర్య 2’ : బన్నీ ఎమోషనల్ పోస్ట్

Updated On : November 27, 2019 / 10:50 AM IST

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్‌ల కాంబోలో రూపొంది 2009 నవంబర్ 27న విడుదలైన ‘ఆర్య 2’, 2019 నవంబర్ 27 నాటికి 10 సంవత్సరాలు పూర్తి చేసుకుంటుంది..

వెండితెరపై ప్రేమకథలు ఎప్పటికీ సజీవంగా ఉంటాయి. ఇప్పటి వరకు మన తెలుగులో అద్భుతమైన ప్రేమకథా చిత్రాలు చాలానే వచ్చాయి. వాటిలో సుకుమార్ ‘ఆర్య’, ‘ఆర్య 2’ సినిమాలు ప్రత్యేకం.. ‘గంగోత్రి’ సినిమాతో వెండితెరకు పరిచయమైన అల్లు అర్జున్‌ను ‘ఆర్య’ సినిమా స్టైలిష్ స్టార్‌ను చేసింది. తెలుగులోనే కాదు మలయాళంలో కూడా బన్నీ స్టార్ హీరోగా ఎదగడానికి ‘ఆర్య’ చాలా బాగా ఉపయోగపడింది.

 

Image

‘ఆర్య’ వచ్చిన 5 సంవత్సరాలకు ఆ సినిమాకు సీక్వెల్‌గా ‘ఆర్య 2’ వచ్చింది. 2009 నవంబర్ 27న విడుదలైన ‘ఆర్య 2’ 2019 నవంబర్ 27 నాటికి 10 సంవత్సరాలు పూర్తి చేసుకుంటుంది. ఈ సందర్భంగా అల్లు అర్జున్ సోషల్ మీడియా ద్వారా ఆ సినిమాను, ఆ సినిమాలోని ‘ఉప్పెనంత ఈ ప్రేమకి.. గుప్పెడంత గుండె ఏమిటో’ అనే పాటను గుర్తు చేసుకున్నారు. డైరెక్టర్ సుకుమార్‌కు ధన్యవాదలు తెలిపాడు.

Image

‘ఆర్య’, ‘ఆర్య 2’ సినిమాలను నాకిచ్చినందుకు సుకుమార్‌కు ఎన్నిసార్లు ధన్యవాదాలు చెప్పినా సరిపోదు. ‘ఐ లవ్యూ.. నా ఊపిరి ఆగిపోయినా.. ఐ లవ్యూ.. నా ప్రాణం పోయినా.. ఎప్పటికీ రుణపడి ఉంటా’.. సుక్కు హెయిర్ కలర్ చేంజ్ అయింది, నా స్కిన్ కూడా మారింది.. కానీ మా మధ్యనున్న ప్రేమ మారలేదు, మేమిద్దరం కలిసినప్పుడు ఉండే పిచ్చీ మారలేదు.. దాన్ని మళ్లీ త్వరలోనే చూడబోతున్నారు..’ అంటూ బన్నీ ట్వీట్ చేశాడు. బన్నీ, సుకుమార్ కలయికలో రూపొందుతున్న హ్యాట్రిక్ చిత్రం త్వరలో సెట్స్ పైకి వెళ్లనుంది..

Image