Abaddameva Jayathe : ‘అబద్ధమేవ జయతే’.. టైటిల్ వెరైటీగా ఉంది.. సినిమా ఎలా ఉంటదో..
తాజాగా ‘అబద్ధమేవ జయతే’ టైటిల్ లోగోని యువ హీరో కార్తికేయ లాంచ్ చేశారు.

Abaddameva Jayathe Title Logo Launch by Hero Karthikeya
Abaddameva Jayathe : అబద్ధాలు ఆడితే ఆడపిల్లలు పుడతారు అనే సామెతని కాన్సెప్ట్ గా తీసుకొని ఓ కామెడీ థ్రిల్లర్ మూవీని తెరకెక్కిస్తున్నారు. సుశాంత్ యష్కీ, ప్రవణ్యా రెడ్డి జంటగా తెరకెక్కిస్తున్న సినిమా ‘అబద్ధమేవ జయతే’. పర్పుల్ ఫిల్మ్ ఫ్యాక్టరీ బ్యానర్ పై శివుడు, రాకేష్, సృజన గోపాల్ నిర్మాణంలో కె. కార్తికేయన్ సంతోష్ దర్శకత్వంలో ఈ అబద్ధమేవ జయతే సినిమా తెరకెక్కుతుంది. మాస్టర్ వికాస్, మాస్టర్ భాను, విజయ కృష్ణా, వెంకీ లింగం, బలగం సుధాకర్.. పలువురు ఈ సినిమాలో ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.
Also Read : Unstoppable with NBK S4 : మరోసారి బాలయ్య షోలో శ్రీలీల.. అన్‌స్టాపబుల్‌లో ఆ హీరో కూడా..
తాజాగా ‘అబద్ధమేవ జయతే’ టైటిల్ లోగోని యువ హీరో కార్తికేయ లాంచ్ చేశారు. టైటిల్ చాలా వెరైటీగా ఉందని మూవీ యూనిట్ కి ఆల్ ది బెస్ట్ చెప్పారు. విలేజ్ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఇప్పటికే సూరారం, వేములవాడ, వికారాబాద్, రాజమండ్రి, కాకినాడ.. ఇలా పలు ఊర్లవద్ద గ్రామీణ వాతావరణంలో సినిమాను షూట్ చేశారు. ఈ సినిమా కోసం ఇరవై ఏళ్ల క్రితం ఉన్న ఒక సెట్ కూడా వేసారట.
ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఈ సినిమాని రిలీజ్ చేయాలని నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. సత్యమేవ జయతేని అబద్ధమేవ జయతేగా మార్చి కొత్తగా టైటిల్ పెట్టారు. మరి సినిమా ఎలా ఉంటుందో చూడాలి.