లేఖ రాస్తే దేశద్రోహమా : ప్రశ్నించిన నసీరుద్దీన్ షా

భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి లేఖ రాస్తే దేహద్రోహ చర్య ఎలా అవుతుందని ప్రముఖ సినీ నటుడు నసీరుద్దీన్ షా ప్రశ్నించారు. సమాజంలో బాధ్యత గల పౌరులుగా వారు తమ విధిని నిర్వర్తించారని, 49 మంది రాసిన లేఖలోని ప్రతి అక్షరాన్ని తాము సమర్థిస్తున్నట్లు వెల్లడించారు. దేశంలో జరుగుతున్న మూకదాడులపై ఆందోళన వ్యక్తం చేస్తూ..ప్రముఖ చరిత్రకారుడు రామచంద్ర గుహ, దర్శకుడు మణిరత్నం, అపర్ణసేన్‌తో సహా ఇతర ప్రముఖులు పీఎం మోడీకి లేఖ రాసిన సంగతి తెలిసిందే.
దీనిపై ఓజా అనే అడ్వకేట్..బీహార్‌లోని ముజఫర్ నగర్ పీఎస్‌లో కంప్లయింట్ చేశారు. దీంతో వారిపై దేశద్రోహం సహా పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేయడం సంచలనం సృష్టిస్తోంది. కేసు నమోదు చేయడంపై 180 మంది ప్రముఖులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు ఈ’ మేరకు వారు ఓ బహిరంగ లేఖను విడుదల చేశారు. సంతకం చేసిన వారిలో ప్రముఖ చరిత్రకారులు రోమిలా థాపర్, బాలీవుడ్ నటుడు నసీరుద్దీన్ షా, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులున్నారు.
ప్రజా గొంతుకను నొక్కెయడంపైనా, మూక దాడులకు వ్యతిరేకంగా ప్రతి రోజు బహిరంగంగా మాట్లాడుతామని షా స్పష్టం చేశారు. తాజాగా రాసిన లేఖ ఎలాంటి ప్రకంపనాలు సృష్టిస్తుందో చూడాలి.
Read More : కొత్త సినిమాలు – దసరా శుభాకాంక్షలు