Kushboo : మరోసారి ఆసుపత్రిలో చేరిన నటి కుష్బూ.. ‘ఈసారైనా కోలుకోవాలని ఆశిస్తున్నా’ అంటూ ట్వీట్!

నటి మరియు రాజకీయవేత్త అయిన కుష్బూ మరోసారి ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారు. ఈసారైనా పూర్తిగా కోలుకోవాలని ఆశిస్తున్నా అంటూ..

Kushboo : మరోసారి ఆసుపత్రిలో చేరిన నటి కుష్బూ.. ‘ఈసారైనా కోలుకోవాలని ఆశిస్తున్నా’ అంటూ ట్వీట్!

Actor and Politician Kushboo is again hospitalized due to bone suffer

Updated On : June 23, 2023 / 7:57 PM IST

Kushboo : సౌత్ లో ఒకప్పుడు హీరోతో సమానంగా స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న నటి కుష్బూ.. అభిమానులు చేత గుడి కూడా కట్టించుకున్నారు. ఇంతటి స్టార్‌డమ్ ని ఎంజాయ్ చేసిన కుష్బూ.. ప్రస్తుతం సినీ, రాజకీయ రంగంలో రాణిస్తున్నారు. సౌత్ లోని పలు భాషల్లో ముఖ్య పాత్రల్లో నటిస్తూనే తమిళనాట రాజకీయవేత్తగా కూడా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం తమిళనాడు బీజేపీ మహిళా నేత కార్యదర్శిగా బాధ్యత నిర్వహిస్తున్నారు. ఇది ఇలా ఉంటే.. కుష్బూ కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధ పడుతున్నారు.

Keedaa Cola : ఈ నగరానికి ఏమైంది రీ రిలీజ్.. కీడా కోలా టీజర్.. అప్డేట్స్ ఇచ్చిన తరుణ్ భాస్కర్!

కొన్నాళ్ల నుంచి వెన్నుముక్క సమస్యతో బాధ పడుతున్న కుష్బూ.. గత ఏడాది అక్టోబర్ లో ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యి ట్రీట్మెంట్ తీసుకోని ఇంటికి చేరుకున్నారు. కానీ ఆ సమస్య నుంచి ఆమె ఇంకా కోలుకోలేదని తాజా సమాచారం బట్టి తెలుస్తుంది. వెన్నుముక్క సమస్యతో తానూ మళ్ళీ హాస్పిటల్ లో అడ్మిట్ అయ్యినట్లు కుష్బూ తన సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు. హాస్పిటల్ బెడ్ పై ఉన్న ఫోటోని షేర్ చేస్తూ.. “కోకిక్స్ బోన్ (టెయిల్ బోన్) చికిత్స కోసం నేను మళ్లీ ఆసుపత్రికి వచ్చాను. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాను. ఈసారైనా పూర్తిగా కోలుకోవాలని ఆశిస్తున్నా” అంటూ ట్వీట్ చేశారు.

Chiranjeevi : చిరంజీవి క్యాన్సర్ టెస్ట్ క్యాంప్ సెంటర్స్.. ఆంధ్రా-తెలంగాణలో ఏర్పాట్లు..

ఇక ఈ పోస్ట్ చూసిన ఆమె అభిమానులు, శ్రేయోభిలాషులు ఆందోళన చెందుతూ.. త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నట్లు కామెంట్స్ చేస్తున్నారు. కాగా రెండు నెలల క్రిందట కూడా కుష్బూ ఆసుపత్రిలో ట్రీట్మెంట్ అందుకున్నారు. అడెనో వైరస్‌ (Adeno virus) అనే అరుదైన రోగం భారిన పడడంతో ఏప్రిల్ నెలలో ఆమె హాస్పిటల్ పాలైంది. దానిని నుంచి కోలుకొని రెండు నెలలు కాకముందే మళ్ళీ ఇలా అవ్వడంతో అభిమానులు కొంచెం ఆందోళన చెందుతున్నారు.