సోనూ సహాయం కోరిన బ్రహ్మాజీ..

  • Published By: sekhar ,Published On : August 21, 2020 / 06:40 PM IST
సోనూ సహాయం కోరిన బ్రహ్మాజీ..

Updated On : August 21, 2020 / 7:03 PM IST

Actor Brahmaji Request to Sonu Sood: లాక్‌డౌన్ సమయంలో కొన్ని వేల మంది వలస కార్మికులకు అండగా నిలిచి తన గొప్ప మనసును చాటుకున్నాడు నటుడు సోనూ సూద్. ఆపదలో ఉన్నవారికి, సహాయం అడిగిన వారికి నేనున్నానంటూ చేయి అందిస్తున్నాడు. కొన్ని వేల మంది సోషల్ మీడియా ద్వారా సోనూసూద్‌కు తమ సమస్యలను విన్నవించుకుంటున్నారు. వీలైనంత మందికి సోనూ అండ్ టీమ్ సహాయం అందిస్తున్నారు.

తాజాగా టాలీవుడ్ నటుడు బ్రహ్మాజీ కూడా సోనూసూద్‌ను సహాయం అడిగాడు. ‘డియర్‌ సూపర్‌మేన్‌ సోనూ భాయ్‌.. నేను డిప్రెషన్‌లో ఉన్నాను. మెంటల్‌గా లాక్‌డౌన్‌ అయిపోయాను. హైదరాబాద్‌లో చిక్కుకుపోయాను. ప్లీజ్‌ నన్ను క్రొయేషియా తీసుకెళ్లు’ అని బ్రహ్మాజీ ట్వీట్ చేశాడు. బ్రహ్మాజీ ఫన్నీ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరి ఈ ట్వీట్‌కు సోనూ సూద్ ఎలా స్పందిస్తాడో చూడాలి.