హీరోయిన్లపై బ్రహ్మాజీ ఆగ్రహం
కరోనా లాక్‌డౌన్ : తెలుగు సినీ కార్మికులను ఆదుకోవడానికి ఏర్పాటు చేసిన ‘సీసీసీ మనకోసం’ చారిటీ సంస్థకు హీరోయిన్స్ మద్దతు తెలపడం లేదంటూ అసహనం వ్యక్తం చేసిన బ్రహ్మాజీ..

కరోనా లాక్‌డౌన్ : తెలుగు సినీ కార్మికులను ఆదుకోవడానికి ఏర్పాటు చేసిన ‘సీసీసీ మనకోసం’ చారిటీ సంస్థకు హీరోయిన్స్ మద్దతు తెలపడం లేదంటూ అసహనం వ్యక్తం చేసిన బ్రహ్మాజీ..
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ప్రజలను వణికిస్తోన్న కరోనా వ్యాధిని అడ్డుకోవడానికి అన్ని దేశాలతో పాటు మన దేశాన్ని కూడా 21 రోజులు లాకౌట్ ప్రకటించిన విషయం తెలిసిందే. దీని వలన ఇబ్బందులు పడుతున్న టాలీవుడ్ సినీ కార్మికుల సంక్షేమం కోసం మెగాస్టార్ చిరంజీవి ఆధ్వర్యంలో తెలుగు సినీ పరిశ్రమ ఏర్పాటు చేసిన కరోనా క్రైసిస్ ఛారిటీకి హీరోలు అందరూ విరాళాలు అందిస్తున్నారు.
సినీ పరిశ్రమలోని కార్మికులను ఆదుకోవడానికి కథానాయికలెవరూ ఎందుకు ముందుకు రావడంలేదని నటుడు బ్రహ్మీజీ అసహనం వ్యక్తం చేశారు. తెలుగు సినీ కార్మికులను ఆదుకోవడానికి ఏర్పాటు చేసిన ‘సీసీసీ మనకోసం’ చారిటీ సంస్థకు హీరోయిన్స్ నుండి మద్దతు లభించకపోవడం పట్ల ఓ ఆయన మాట్లాడుతూ ‘‘ముంబైకి చెందిన చాలా మంది హీరోయిన్స్ ఇక్కడ పనిచేస్తున్నారు. అందరూ స్టార్ హీరోయిన్స్‌గా రాణిస్తున్నారు.
అయితే వారెవరూ కార్మికుల కోసం ఏర్పాటు చేసిన చారిటీ గురించి స్పందించక పోవడం ఆశ్చర్యంగా ఉంది. లావణ్య త్రిపాఠి వంటి వారు మాత్రమే స్పందించారు’’ అన్నారు. బ్రహ్మాజీ అన్న మాటల్లోనూ నిజం లేకపోలేదు. మరి సినీ పెద్దలు ఈ వ్యవహారంపై ఎలా స్పందిస్తారో వేచి చూడాలి. కాగా లావణ్య త్రిపాఠి తనవంతుగా రూ.లక్ష విరాళమిచ్చిన సంగతి తెలిసిందే.
Read Also : పూరి ఫేవరెట్ ప్లేస్‌లో కరోనా