Cheran : షూటింగ్‌లో ప్రమాదం.. పాపులర్ యాక్టర్ తలకు 8 కుట్లు..

పాపులర్ యాక్టర్, డైరెక్టర్.. చేరన్ సెట్లో ప్రమాదానికి గురయ్యారు..

Cheran : షూటింగ్‌లో ప్రమాదం.. పాపులర్ యాక్టర్ తలకు 8 కుట్లు..

Cheran

Updated On : August 5, 2021 / 8:43 PM IST

Cheran: లాక్‌డౌన్ కారణంగా షూటింగులు బంద్ అయిపోయాయ్. థియేటర్లు మూతపడ్డాయ్. కోలుకుంటున్నాం అనుకుంటుండగా సెకండ్ వేవ్ దెబ్బమీద దెబ్బవేసింది. ఇప్పుడిప్పుడే షూటింగ్స్ స్టార్ట్ అయ్యాయి. అసలే నష్టాల్లో కూరుకుపోయిన ఫిలిం ఇండస్ట్రీని ఇప్పుడు వరుస ప్రమాదాలు కలవరపెడుతున్నాయి. కమల్ హాసన్ ‘భారతీయుడు 2’ షూట్‌లో భారీ ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. ఇటీవల విశాల్ కూడా గాయపడ్డారు.

ఇప్పుడు పాపులర్ యాక్టర్, డైరెక్టర్.. చేరన్ (రవితేజ హీరోగా నటించిన ఎమోషనల్ ఎంటర్‌టైనర్ ‘నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమరీస్’ సినిమాను మొదట తమిళ్‌లో డైరెక్ట్ చేస్తూ హీరోగా నటించారు. ఈ సినిమాకి గాను నేషనల్ అవార్డ్ కూడా అందుకున్నారు) సెట్లో ప్రమాదానికి గురయ్యారు.

Anandham Vilayadum Veedu

 

‘కడలి’ ఫేమ్ గౌతమ్ కార్తీక్ హీరోగా నటిస్తున్న ‘ఆనందం విలయాడం వీడు’ సినిమాలో చేరన్ ఇంపార్టెంట్ రోల్ చేస్తున్నారు. రాజశేఖర్ కుమార్తె శివాత్మిక రాజశేఖర్ హీరోయిన్‌గా కోలీవుడ్‌కి ఎంట్రీ ఇస్తుంది. యాంకర్, క్యారెక్టర్ యాక్ట్రెస్ హరి తేజ కూడా ఈ సినిమాలో యాక్ట్ చేస్తుంది. నందా పెరియస్వామి డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ షూటింగ్ తమిళనాడులోని దిండిగల్‌లో జరుగుతోంది.

ఇంటిపైన ఓ సీన్ షూట్ చేస్తుండగా, పైకప్పు నుంచి కాలు జారి చేరన్ కిందపడిపోయారు. ఆయన తలకు బలమైన గాయమైంది. వెంటనే అలెర్ట్ అయిన టీం దగ్గర్లోని హాస్పిటల్‌కి తరలించారు. తలకు 8 కుట్లు పడ్డాయి. అయితే హాస్పిటల్ నుండి తిరిగొచ్చి, మళ్లీ షూటింగులో పాల్గొనడం విశేషం. ‘సినిమా అంటే ఆయనకు అంత ప్యాషన్, నిర్మాత నష్టపోకూడదని షూటింగ్‌కి అటెండ్ అయ్యారు.. గెట్ వెల్ సూన్’ అంటూ మూవీ టీం, కోలీవుడ్ సెలబ్రిటీలు, నెటిజన్లు చేరన్‌ను అభినందిస్తున్నారు.

Cheran Injured