చావు బ‌తుకుల్లో న‌టుడు.. ఆర్థికసాయం కోసం ఎదురుచూపులు..

  • Published By: sekhar ,Published On : October 14, 2020 / 08:37 PM IST
చావు బ‌తుకుల్లో న‌టుడు.. ఆర్థికసాయం కోసం ఎదురుచూపులు..

Updated On : October 14, 2020 / 9:17 PM IST

Faraaz Khan On Life Support: ఈ 2020 అస్సలు కలిసిరాలేదు. ఆనందంగా కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టిన కొద్ది రోజుల్లోనే కరోనా మహమ్మారి వ్యాప్తితో జనజీవనం స్తంభించింది. పనులు నిలిచిపోయాయి. సినిమా రంగం తీవ్ర సంక్షోభం ఎదుర్కొంది. పలువురు సినీ ప్రముఖులు అనారోగ్యం అలాగే కరోనా కారణంగా కన్నుమూశారు.

తాజాగా బాలీవుడ్ నటుడు ఫ‌రాజ్‌ ఖాన్ (Faraaz Khan) చావు బ‌తుకుల మధ్య ఐసీయులో కొట్టుమిట్టాడుతున్నారనే వార్త బాలీవుడ్ పరిశ్రమలో చర్చనీయాంశమైంది. వివ‌రాల్లోకెళ్తే .. మ‌హాభార‌తం సీరియ‌ల్‌లో న‌టించిన యూస‌ఫ్‌ఖాన్ త‌న‌యుడైన ఫ‌రాజ్‌ఖాన్ గ‌త కొంత‌కాలంగా ద‌గ్గుతో బాధ‌ప‌డుతున్నారు.


కొద్దిరోజుల క్రితం డాక్ట‌ర్‌ను వీడియోకాల్‌లో సంప్ర‌దించ‌గా, ఫ‌రాజ్ ప‌రిస్థితిని అర్థం చేసుకుని హాస్పిట‌ల్‌లో జాయిన్ అవ‌మ‌ని సూచించడంతో.. కుటుంబ స‌భ్యులు ఆయణ్ణి బెంగుళూరులోని ఓ ప్రైవేట్ హాస్పిట‌ల్‌లో చేర్చారు. త‌ర్వాత ఇన్‌ఫెక్ష‌న్ ఛాతీ భాగం నుండి మెద‌డుకి సోకడంతో గత 5 రోజులుగా వెంటిలేటర్ పై ఉంచి చికిత్సనందిస్తున్నారు.


ఫరాజ్ సోదరుడు, నటుడు Fahmaan Khan కూడా బ్రెయిన్ ఇన్‌ఫెక్ష‌న్ తో బాధపడుతున్నాడు. ఫరాజ్ ట్రీట్‌మెంట్ కోసం రూ. 25 లక్షలు అవుతుందని, బ్రతకడానికి 50 శాతం అవకాశముందని వైద్యులు చెప్పారని, సోషల్ మీడియా ద్వారా ఇప్పటికి 54 మంది రూ.2.2 లక్షలు ఆర్థికసాయమందించారని ఫహ్మాన్ ఖాన్ తెలిపారు.


ప్రస్తుతం ICUలో చావు బ‌తుకుల మ‌ధ్య పోరాడుతున్నాడు ఫరాజ్ ఖాన్. అతని ప‌రిస్థితి తెలుసుకున్న న‌టి, నిర్మాత పూజా భ‌ట్ ట్విట్టర్ ద్వారా ఈ విషయాన్ని తెలియ‌జేస్తూ వారి కుటుంబ స‌భ్యుల‌కు ఆర్థిక సాయాన్ని అందించాల‌ని కోరారు. కాగా ఫ‌రాజ్ ఖాన్ హిందీలో ‘మెహందీ’, ‘ఫ‌రేబ్’ వంటి చిత్రాల్లో న‌టించారు.