Jabardasth Avinash : జబర్దస్త్ అవినాష్ ఇంట్లో విషాదం.. ఇన్‌స్టాగ్రామ్‌లో ఎమోషనల్ పోస్ట్
కమెడియన్ అవినాష్ ఇంట విషాదం నెలకొంది. అవినాష్ భార్య అనూజ సోషల్ మీడియాలో ఎమోషనల్‌గా పోస్టు పెట్టారు.

Jabardasth Avinash
Jabardasth Avinash : జబర్దస్త్ అవినాష్ ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. భార్య అనూజకు అబార్షన్ కావడంతో తాము బిడ్డను కోల్పోయినట్లు ఇన్‌స్టాగ్రామ్‌లో ఎమోషనల్ పోస్టు పెట్టారు.
Mirnaa Menon : అమ్మాయిలకు నాగార్జున మన్మధుడు.. కానీ ఆ హీరోయిన్‌కి మాత్రం అన్నయ్యంట.. పోస్ట్ వైరల్..
అవినాష్ ముక్కు అవినాష్‌గా, జబర్దస్త్ అవినాష్‌గా పిలుస్తారు. కమెడియన్‌గా పేరు తెచ్చుకున్న అవినాష్ ప్రస్తుతం సినిమాలు, ఈవెంట్స్ చేస్తూ బిజీగా ఉన్నారు. జబర్దస్త్ షో అవినాష్‌కు కమెడియన్‌గా ఎంతో గుర్తింపు తెచ్చిపెట్టింది. కరోనా టైమ్‌లో ఆర్ధికంగా ఇబ్బందులు పడ్డ అవినాష్ బిగ్ బాస్ 4 సీజన్‌లో పాల్గొన్న తర్వాత కాస్త సెటిల్ అయ్యారు. 2001 లో అనూజని పెళ్లాడి ఓ ఇంటివాడైన అవినాష్ పూర్తిగా సినిమాలు, ఈవెంట్స్ మీద దృష్టి పెట్టారు.
అవినాష్, అనూజ దంపతులు తమ సొంత యూట్యూబ్ ఛానల్‌లో వీడియోలు చేస్తూ దూసుకుపోతున్నారు. వారి వివాహం దగ్గర నుండి ప్రతి సందర్భాన్ని వీడియో చేసి అప్ లోడ్ చేస్తూ వస్తున్నారు. ఇక అనూజ ప్రెగ్నెన్సీ, సీమంతం వేడుక అంశాలపై కూడా వీడియోలు చేసారు. కాగా అవినాష్ ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. రీసెంట్‌గా అనూజకు అబార్షన్ కావడంతో బిడ్డను కోల్పోయారు. ఈ విషయాన్ని అవినాష్ భార్య అనూజ అవినాష్ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్టు పెట్టారు.
Animal Movie : ముంబైలో భారీగా ‘యానిమల్’ సక్సెస్ పార్టీ.. తరలివచ్చిన తారలు..
‘నా లైఫ్‌లో సంతోషమైన, బాధ అయినా.. నా ఫ్యామిలీ అయిన మీతోనే పంచుకుంటాను.. ఇప్పటివరకు నా ప్రతి ఆనందాన్ని మీతోనే పంచుకున్నాను. కానీ..మొదటిసారి నా జీవితంలోని ఒక విషాదాన్ని మీతో పంచుకుందాం అని అనుకుంటున్నాను.. కొన్ని కారణాల వల్ల మా బిడ్డని కోల్పోయాం. ఈ విషయం మేము ఎప్పటికీ జీర్ణించుకోలేనిది. అంత తొందరగా మర్చిపోలేనిది. మీకు ఎప్పటికైనా చెప్పాలి అన్న బాధ్యతతో ఈ విషయాన్ని మీతో పంచుకుంటున్నాను. ఇప్పటివరకు మీరు మాపై చూపించిన ప్రేమకి థ్యాంక్యూ.. మీ ప్రేమ ఎప్పటికీ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను. అలాగే దయచేసి ఈ విషయంపై ఎలాంటి ప్రశ్నలు అడిగి మమ్మల్ని బాధ పెట్టవద్దు. మీరందరూ అర్ధం చేసుకుంటారని కోరుకుంటూ మీ అనూజ అవినాష్’ అంటూ అనూజ ఇన్‌స్టా పోస్టులో రాసుకొచ్చారు. నెటిజన్లు అవినాష్ దంపతులకు ధైర్యం చెబుతున్నారు.
View this post on Instagram