Kavya Thapar: తప్పతాగి యాక్సిడెంట్.. ముంబైలో టాలీవుడ్ హీరోయిన్ అరెస్ట్!
నటిగా ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న నటి అర్ధరాత్రి తప్పతాగి కార్ డ్రైవింగ్ చేయడమే కాకుండా యాక్సిడెంట్ కూడా చేసింది. తెలుగులో రెండు సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న ఆమె బాలీవుడ్ లో..

Kavya Thapar
Kavya Thapar: నటిగా ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న నటి అర్ధరాత్రి తప్పతాగి కార్ డ్రైవింగ్ చేయడమే కాకుండా యాక్సిడెంట్ కూడా చేసింది. తెలుగులో రెండు సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న ఆమె బాలీవుడ్ లో ప్రయత్నాల్లో ముంబైలోనే ఉంటుండగా అక్కడే ప్రమాదం చేసింది. ‘ఈ మాయ పేరేమిటో’ సినిమా ద్వారా తెలుగులో అరంగేట్రం చేసిన కావ్యా థాపర్ ఆ తర్వాత ‘ఏక్ మినీ కథ’ చేసింది. అది ఓటీటీలో విడుదలైనా కావ్యాకి గుర్తింపు తెచ్చింది.
Young Heroes: పడుతూ లేస్తున్న యంగ్ హీరోలు.. ఒక్క బ్లాక్ బస్టర్ ప్లీజ్!
గురువారం ఉదయం ఫిబ్రవరి 17న మద్యం సేవించిన కావ్యా థాపర్.. కారు నడపడమే కాకుండా ముంబైలోని జెడబ్ల్యూ మారియట్ హోటల్ వద్ద యాక్సిడెంట్ కూడా చేసింది. ఆ ఘటనలో ఒకరు గాయపడగా అదృష్టవశాత్తు ప్రాణాపాయం లేదు. ప్రమాదం చేయడమే కాకుండా.. ఆపై పోలీసులతో గొడవపడి డ్యూటీలో ఉన్న పోలీసులపై దూషణకి దిగింది. మహిళా కానిస్టేబుల్ ను బూతులు తిడుతూ కాలర్ పట్టుకొని ఇష్టం వచ్చినట్లుగా రచ్చ రచ్చ చేసింది.
Arabic Kuthu: విజయ్ బీస్ట్ పాటకి ఎన్టీఆర్ ‘లవ్ దెబ్బ’ మాస్ స్టెప్పులేస్తే?!
శుక్రవారం ముంబై పోలీసులు కావ్యా థాపర్‌ను అరెస్ట్ చేసిన ముంబై పోలీసులు జుహూ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అంధేరి కోర్టులో ఆమెను హాజరుపరచగా.. జ్యూడిషియల్ కస్టడీ విధించారు. మద్యం మత్తులో హీరోయిన్ హల్చల్ అంటూ ముంబై సినీ ఇండస్ట్రీలో కావ్యా థాపర్ వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.