Pushpa 2 – Game Changer : కుదిరితే పుష్ప 2 ఏలియన్స్‌కు కూడా షో వేస్తాం.. గేమ్ ఛేంజర్ కంటే పుష్ప 2 పెద్ద హిట్ అవుతుంది.. నటుడు వ్యాఖ్యలు..

తాజాగా పుష్ప 2లో నటించిన క్రాంతి కిల్లి అనే నటుడు పుష్ప 2 సినిమా గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు.

Pushpa 2 – Game Changer : కుదిరితే పుష్ప 2 ఏలియన్స్‌కు కూడా షో వేస్తాం.. గేమ్ ఛేంజర్ కంటే పుష్ప 2 పెద్ద హిట్ అవుతుంది.. నటుడు వ్యాఖ్యలు..

Actor Kranthi Killi Interesting Comments on Pushpa 2 and Game Changer Movies

Updated On : November 13, 2024 / 4:29 PM IST

Pushpa 2 – Game Changer : అల్లు అర్జున్ పుష్ప 2 సినిమా కోసం ప్రేక్షకులు ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా డిసెంబర్ 5న రిలీజ్ కానుంది. ట్రైలర్ 17న రానుంది. ఇప్పటికే వచ్చిన టీజర్, సాంగ్స్ తో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. మూవీ యూనిట్ ప్రమోషన్స్ కూడా భారీగా చేయబోతున్నట్టు, దేశ వ్యాప్తంగా ఏడు నగరాల్లో ఈవెంట్స్ నిర్వహించనున్నట్టు ప్రకటించారు.

తాజాగా పుష్ప 2లో నటించిన క్రాంతి కిల్లి అనే నటుడు పుష్ప 2 సినిమా గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. పలు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించిన క్రాంతి కిల్లి తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఈ ఇంటర్వ్యూలో మీరు గేమ్ ఛేంజర్, పుష్ప 2 రెండు సినిమాల్లో నటించారు. వీటిలో ఏది పెద్ద హిట్ అవుతుంది అనుకుంటున్నారు అనే ప్రశ్న ఎదురైంది.

Also Read : Rashmika Mandanna : పుష్ప 2 డబ్బింగ్ పూర్తిచేసిన రష్మిక మందన్న.. సినిమాపై హైప్ పెంచుతూ పోస్ట్..

దీనికి క్రాంతి కిల్లి సమాధానమిస్తూ.. పుష్ప 2కి మొదటి ప్లేస్ ఇస్తాను. పుష్ప 2 సినిమా 11,500 స్క్రీన్స్ లో రిలీజ్ చేస్తున్నారు. గేమ్ ఛేంజర్ తో పోలిస్తే పుష్ప 2 ఎక్కువ థియేటర్స్ లో రిలీజ్ చేస్తున్నారు. అలా చూసుకుంటే పుష్ప 2 ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. ఇద్దరూ పెద్ద స్టార్స్. పుష్ప 2లో నా పాత్ర లెంగ్త్ ఎక్కువ, గేమ్ ఛేంజర్ లో నా లెంగ్త్ తక్కువ. కుదిరితే పుష్ప 2 సినిమా అంతరిక్షంలో ఏలియన్స్ కు కూడా షో వేస్తారు. పుష్ప 2 కోసం అంత క్రేజ్ ఉంది. పుష్ప పార్ట్ 2 కానీ గేమ్ ఛేంజర్ సింగిల్ ఫిలిం. మాములు ఫిలిం కంటే కూడా పార్ట్ 2 ఉన్న సినిమాకే ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది. పుష్ప 2 చూసిన తర్వాత మీకు ఆ సినిమా ఎక్కువ హై ఇస్తుంది. ఇటీవలే నేను పుష్ప 2 డబ్బింగ్ పూర్తి చేశాను. ఫస్ట్ హాఫ్ లో నేను ఉండను. సెకండ్ హాఫ్ లో జాతర ఎపిసోడ్ లో వచ్చి తర్వాత ఉంటాను. డబ్బింగ్ చెప్పేటప్పుడు ఫస్ట్ హాఫ్ 25 నిముషాలు చూసాను, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ లేకుండానే గూస్ బంప్స్ వచ్చాయి. ఆటోమేటిక్ గా కాన్ఫిడెన్స్ మరింత పెరిగింది. గేమ్ ఛేంజర్ పెద్ద హిట్ అయి దానికి పార్ట్ 2 అయితే వేరే చెప్పేవాడినేమో. కానీ గేమ్ ఛేంజర్ డైరెక్ట్ ఫిలిం, పుష్ప 2 సీక్వెల్ సినిమా అని ఇందిరెచ్త్ గా పుష్ప 2 గేమ్ ఛేంజర్ కంటే పెద్ద హిట్ అవుతుందని వ్యాఖ్యలు చేసారు. దీంతో క్రాంతి కిల్లి వ్యాఖ్యలను అల్లు అర్జున్ ఫ్యాన్స్ వైరల్ చేస్తున్నారు.