Nandu : నడవలేని స్థితిలో ఉన్నా.. స్టూడియోకి వచ్చి డబ్బింగ్ చెప్పిన నటుడు..
అయితే ఇటీవల నందుకు యాక్సిడెంట్ అవ్వడంతో కాలు తీవ్రంగా గాయపడటంతో ఆపరేషన్ జరిగింది. తన సోషల్ మీడియాలో కాలుకు కట్టుతో కుంటుతూ ఉన్న ఓ ఫోటోని షేర్ చేస్తూ ఈ విషయాన్ని తెలియచేశాడు నందు. కోలుకోవడానికి కనీసం..................

Actor Nandu is unable to walk due to a leg accident but he came for dubbing
Nandu : హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, యాంకర్ గా ప్రస్తుతం బిజీగా ఉన్నాడు నటుడు నందు. సింగర్ గీతామాధురిని పెళ్లి చేసుకొని, ఒక పాపతో, ఫ్యామిలీతో చాలా హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తున్నాడు. ఇటీవలే కొన్ని నెలల క్రితం బొమ్మ బ్లాక్ బస్టర్ అనే సినిమాతో వచ్చి పర్వాలేదనిపించాడు. ప్రస్తుతం పలు సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, క్రికెట్ షోలకు యాంకర్ గా చేస్తున్నాడు నందు.
అయితే ఇటీవల నందుకు యాక్సిడెంట్ అవ్వడంతో కాలు తీవ్రంగా గాయపడటంతో ఆపరేషన్ జరిగింది. తన సోషల్ మీడియాలో కాలుకు కట్టుతో కుంటుతూ ఉన్న ఓ ఫోటోని షేర్ చేస్తూ ఈ విషయాన్ని తెలియచేశాడు నందు. కోలుకోవడానికి కనీసం ఆరు నెలలు అయినా పడుతుందని చెప్పాడు. దీంతో నందు త్వరగా కోలుకోవాలని అంతా కోరుకుంటున్నారు. కాలుకి ఆపరేషన్ జరిగి కట్టు పడి నడవలేని స్థితిలో ఉన్నా యాక్టివ్ గానే ఉంటూ ఇంట్లోనే ఏదో ఒకటి చేస్తూ వీడియోలు, ఫోటోలు షేర్ చేస్తున్నాడు నందు.
Bollywood Heroins : టాలీవుడ్ కి క్యూ కడుతున్న బాలీవుడ్ హీరోయిన్స్..
తాజాగా నందు డబ్బింగ్ స్టూడియోకి వచ్చి డబ్బింగ్ చెప్పిన ఫోటో ఒకటి పోస్ట్ చేశాడు. నడవలేని స్థితిలో ఉన్నా ఇంటి నుంచి డబ్బింగ్ స్టూడియోకి వచ్చి స్టిక్ ఆధారంతోనే వచ్చి కూర్చొని కాలుని పైకి పెట్టి ఇటీవల తాను నటించిన ఓ సినిమాలోని పాత్రకు డబ్బింగ్ చెప్తున్నాడు. దీంతో ఇలాంటి పరిస్థితుల్లో కూడా వర్క్ చేస్తున్నామంటూ నెటిజన్లు అభినందిస్తున్నారు. నందు త్వరగా కోలుకొని మళ్ళీ బిజీ అవ్వాలని ప్రార్థిస్తున్నారు.