నితిన్ అస్సలు ఆగట్లేదు..వరుస సినిమాలతో బిజీ బిజీ

నితిన్ అస్సలు ఆగట్లేదు..వరుస సినిమాలతో బిజీ బిజీ

Updated On : January 6, 2021 / 2:55 PM IST

Actor Nithin : సినిమాలు చెయ్యడానికి హిట్ అవసరంలేదు .. సినిమా మీద ప్యాషన్,సక్సెస్ కొడతానన్న నమ్మకం ఉంటే చాలు అని ప్రూవ్ చేస్తూ.. డే బై డే తనను తాను ఇంప్రూవ్ చేసుకుంటూ హిట్ వైపు దూసుకెళుతున్నారు నితిన్. రొటీన్ కమర్షియిల్ సినిమాల్ని పక్కన పెట్టి .. ఎక్స్ పెరిమెంటల్ రూట్ లో వెళుతున్న ఈ హీరోకి అప్ కమింగ్ సినిమాలు కలిసొస్తాయా..? ఇండస్ట్రీకి వచ్చి ఇన్ని సంవత్సరాలు అవుతున్నా.. ఇంకా టాప్ స్టార్స్ లిస్ట్ లో ఎగ్జిస్టెన్సీ కోసం సఫర్ కోసం అవుతున్నారు నితిన్. లవ్ స్టోరీల నుంచి యాక్షన్, మాస్, థ్రిల్లర్స్..ఇలా ప్రతి జానర్ ట్రై చేస్తూ సక్సెస్ స్ట్రీమ్ లైన్లో కి రావడానికి చూస్తున్నారు. లాస్ట్ ఇయర్ భీష్మతో సక్సెస్ కొట్టిన నితిన్ .. రంగ్ దే సినిమాతో ఆడియన్స్ ని ఎంటర్ టైన్ చెయ్యబోతున్నారు.

ఫ్లాప్ సినిమాల్ని అస్సలు పట్టించుకోకుండా హిట్ టార్గెట్ ని ఫిక్స్ చేసుకున్నారు నితిన్. అందుకే కెరీర్ లో ప్రయోగాలు చేస్తూ..కంటిన్యూ అవుతున్నారు. లేటెస్ట్ గా నితిన్ చంద్రశేఖర్ యేలేటి డైరెక్షన్లో వచ్చిన చెక్ మూవీ టీజర్ చూస్తే .. ఇది 100 పర్సెంట్ కరెక్ట్ అనిపిస్తుంది. రొటీన్ స్టోరీస్ కాకుండా ఆడియన్స్ పల్స్ పట్టుకుని తన కెరీర్ ని కొత్తగా డిజైన్ చేసుకుంటున్నారు నితిన్. నితిన్ రంగ్ దే, చెక్ మూవీస్ తో పాటు మేర్ల పాక గాంధీ డైరెక్షన్లో మరో సినిమా చేస్తున్నారు. బాలీవుడ్ లో సూపర్ హిట్ అయ్యిన థ్రిల్లర్ మూవీ అందాధున్ రీమేక్ గా ఈ సినిమా తెరకెక్కుతోంది. సీనియర్ హీరోయిన్ తమన్నా, నభానటేష్ లీడ్ రోల్స్ లో నితిన్ గుడ్డివాడిగా కనిపించబోతున్న ఈ సినిమాతో మరో ఇంట్రస్టింగ్ మూవీ తెరమీదకి వస్తున్నారు నితిన్.

ఈ మూడు సినిమాలు ఇంకా రిలీజ్ కాకుండానే కృష్ణ చైతన్య తో పవర్ పేట మూవీని కూడా లైన్లో పెట్టారు నితిన్. కెరీర్ లోనే ఛాలెంజింగ్ ఫిల్మ్ గా ఉండబోతోందని చెప్పిన నితిన్..ఈ సినిమా స్క్రిప్ట్ కి ఫిదా అయ్యి తనే ప్రొడ్యూసర్ గా మారారు. ఇలా వరుసగా 4 డిఫరెంట్ సినిమాల్ని లైన్లో పెట్టి ఏ క్యారెక్టర్ కి తగ్గట్టు అలా మౌల్డ్ అవుతూ సినిమా మీద తన ప్యాషన్ ని ప్రూవ్ చేసుకుంటూ సక్సెస్ రూట్ లోకి వెళుతున్నారు నితిన్.