Prashant Karthi : సినిమా కోసం జుట్టు పెంచితే.. జుట్టు లేని లుక్ తో సినిమా షూట్..
ఇటీవల పోతుగడ్డ సినిమా ఈటీవీ విన్ ఓటీటీలోకి వచ్చింది.

Actor Producer Prashant Karthi played Key Role in Pothugadda Movie
Prashant Karthi : గతంలో కొండా, అనంత, నమో సినిమాలతో ప్రేక్షకులని పలకరించిన నటుడు, నిర్మాత ప్రశాంత్ కార్తీ. ఇటీవల పోతుగడ్డ అనే సినిమాలో ఓ డిఫరెంట్ షేడ్స్ లో నటించి మెప్పించాడు. పృథ్వీ దండమూడి, విస్మయ శ్రీ, ప్రశాంత్ కార్తి, శత్రు, ఆడుకాలం నరేన్.. పలువురు ముఖ్య పాత్రల్లో తెరకెక్కిన సినిమా పోతుగడ్డ. 24 సినిమా స్ట్రీట్ బ్యానర్ పై అనుపమ చంద్ర కోడూరి, డా.జి. శరత్ చంద్రా నిర్మాణంలో రక్ష వీరమ్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది.
ఇటీవల పోతుగడ్డ సినిమా ఈటీవీ విన్ ఓటీటీలోకి వచ్చింది. ఈ సినిమాకు ఓటీటీలో మంచి స్పందన వస్తోంది. ఈ సినిమాలో వెంకట్ అనే డిఫరెంట్ షేడ్స్ లో నటించిన ప్రశాంత్ కార్తి తాజాగా మీడియాతో మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలు తెలిపారు.
ప్రశాంత్ కార్తీ మాట్లాడుతూ.. కెమెరామెన్ రాహుల్ ద్వారా నాకు ఈ సినిమా అవకాశం వచ్చింది. ఈ సినిమా కోసం గుబురు గడ్డం, పొడవు జుట్టు కావాలని అన్నారు. ఆ లుక్ కోసం బాగా పెంచాను. కానీ మధ్యలో కొన్ని అనివార్య కారణాల వల్ల నేను జుట్టు తీసేయాల్సి వచ్చింది. దీంతో ఈ సినిమా ఆఫర్ పోయినట్టే అనుకున్నాను. కానీ డైరెక్టర్ రక్షని కలిస్తే అప్పుడు ఉన్న నా లుక్‌ని చూసి బాగుంది, ఈ లుక్ లోనే సినిమా చేద్దాం అన్నారని తెలిపాడు.
ఇక ఈ సినిమాలో తన పాత్ర గురించి మాట్లాడుతూ.. నా పాత్ర చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. సినిమా మొదట్లో, చివర్లో నా పాత్రలోని షేడ్స్ కనిపిస్తాయి. ఆ వేరియేషన్ నాకు కూడా నచ్చింది. ఆ పాత్ర షేడ్స్ చూసే ఈ సినిమాకు ఓకే చెప్పాను. నా పాత్రలోని వేరియేషన్, యాక్టింగ్ గురించి అందరూ అభినందిస్తున్నారు. డైరెక్టర్స్ చంద్ర సిద్దార్థ, చంద్రశేఖర్ యేలేటి.. లాంటి వాళ్ళు కూడా ప్రశంసించారు అని తెలిపాడు.
Also Read : Allu Brothers : అల్లు బ్రదర్స్ మొత్తం ముగ్గురు కాదు నలుగురా..? అల్లు శిరీష్ ఏం చెప్పాడంటే.. ?
ఈ సినిమా గురించి మాట్లాడుతూ.. పోతుగడ్డ షూటింగ్ మొత్తం ఆల్మోస్ట్ నైట్ టైంలోనే జరిగింది. అది కూడా చలికాలంలోనే షూటింగ్ చేశాం. దాంతో చలికి కాస్త కష్టపడ్డాం. అయిన ఆ చలిలో మాకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా మా నిర్మాతలు చూసుకున్నారు. ఈ సినిమాలో ఓ మంచి ప్రేమ కథ, యాక్షన్, ఎమోషన్స్ ఇలా అన్ని ఉన్నాయి. రాజకీయం చుట్టూ ఈ కథ తిరిగినా కూడా ఇందులో అందమైన ప్రేమ కథను బాగా చూపించారు అని తెలిపాడు ప్రశాంత్ కార్తీ. త్వరలో రాయలసీమ బ్యాక్ డ్రాప్‌లో ఓ యాక్షన్ ప్యాక్డ్ సినిమా చేస్తున్నట్టు ప్రకటించాడు.