Srikanth : అప్పట్లో శ్రీకాంత్ కొడుకుని కిడ్నాప్ చేసిన ఎన్టీఆర్.. అది మీకు తెలుసా..?

హీరోగా, విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా శ్రీకాంత్ ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. సెకండ్ ఇన్నింగ్స్‌లో కూడా వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు. తాజాగా మీడియాతో మాట్లాడిన శ్రీకాంత్ ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నారు.

Srikanth : అప్పట్లో శ్రీకాంత్ కొడుకుని కిడ్నాప్ చేసిన ఎన్టీఆర్.. అది మీకు తెలుసా..?

Srikanth

Srikanth : నటుడు శ్రీకాంత్ 1991 లో ‘పీపుల్స్ ఎన్ కౌంటర్’ సినిమాతో వెండితెరపై అడుగు పెట్టారు. హీరోగా, విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా పేరు తెచ్చుకున్నారు. ప్రస్తుతం రామ్ చరణ్‌తో ‘గేమ్ ఛేంజర్’, ఎన్టీఆర్ తో ‘దేవర’ సినిమాలు చేస్తు బిజీగా ఉన్నారు. రీసెంట్‌గా మీడియాతో మాట్లాడిన శ్రీకాంత్ ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నారు.

ఫ్యామిలీ హీరోగా శ్రీకాంత్ మంచి పేరు తెచ్చుకున్నారు. ఒకప్పుడు ఆయన సినిమాలు చూడటానికి మహిళలు క్యూ కట్టేవారు. తనదైన టాలెంట్ తో ఎదిగిన శ్రీకాంత్ 100 కు పైగానే సినిమాల్లో నటించారు. హీరోగా, విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ఆకట్టుకున్నారు. ఇటీవల మీడియాతో మాట్లాడిన శ్రీకాంత్ అప్పటి ఇప్పటి టాప్ హీరోలతో తనకున్న అనుబంధాన్ని షేర్ చేసుకున్నారు. అప్పట్లో ఎన్టీఆర్ చేసిన ఓ తుంటరి పని కూడా చెప్పుకొచ్చారు.

Sandeep Vanga : బాలీవుడ్‌పై మల్లారెడ్డి కామెంట్స్.. సందీప్ వంగా రియాక్షన్.. ఆయనకి ఏజ్ అయ్యిపోయింది..

తారక్ ఎక్కడ ఉంటే అక్కడ గొడవ గొడవగా ఉంటుందన్నారు శ్రీకాంత్. ఎన్టీఆర్ ఇండస్ట్రీకి రాకముందు శ్రీకాంత్ ఇంటి పక్కనే ఉండేవారట. ఒకరోజు శ్రీకాంత్ కొడుకు రోషన్‌ను ఎవరికి చెప్పకుండా ఎత్తుకెళ్లారట ఎన్టీఆర్.  శ్రీకాంత్ కుటుంబం ఇంట్లో రోషన్ కనపడక కంగారు పడ్డారట. అన్నిచోట్ల వెతులాట మొదలుపెట్టారట. అక్కడికి వచ్చిన ఎన్టీఆర్ ఏంటి బాబాయ్ వెతుకుతున్నావ్ అని.. రోషన్ తన దగ్గరే ఉన్నాడని చల్లగా చెప్పారట. ఎన్టీఆర్ అంతటి ఎనర్జిటిక్ పర్సన్‌ని తాను ఎక్కడ చూడలేదని చెప్పారు శ్రీకాంత్.

Karthi : హీరో కార్తీ సినిమా వివాదం.. క్షమాపణలు చెప్పిన నిర్మాత..

విక్టరీ వెంకటేష్‌తో శ్రీకాంత్ చాలా సినిమాల్లోనే నటించారు. వెంకటేష్ ఎప్పుడూ నవ్వుతూ మాట్లాడతారని ఆయనంత హ్యాపీ పర్సన్‌ని తాను చూడలేదని చెప్పారు శ్రీకాంత్. రామ్ చరణ్ గురించి ప్రస్తావిస్తూ చాలా సాఫ్ట్ గోయింగ్.. మెచ్యూర్డ్ పర్సన్ అని మెచ్చుకున్నారు. బాల‌కృష్ణ ఏదైనా స్ట్రెయిట్‌గా అనేస్తారని.. భోళాశంకరుడని చెప్పారు. మెగాస్టార్ చిరంజీవి గురించి చెబుతూ శ్రీకాంత్ ఎమోషనల్ అయ్యారు. ఆయన అభిమాని కాకుంటే తను ఇండస్ట్రీలోకి వచ్చేవాడిని కానని చెప్పారు. అప్పట్లో వరుసగా పెద్ద బ్యానర్లలో రిలీజైన 7 సినిమాలు ఫ్లాప్ అయినప్పుడు తాను డిప్రెషన్ లోకి వెళ్లిపోయానని చిరంజీవి తనని కూర్చోబెట్టుకుని  ధైర్యం చెప్పారని అన్నారు శ్రీకాంత్. ఇలా ఇండస్ట్రీలో తనకు అందరితో ఉన్న స్నేహబంధాన్ని షేర్ చేసుకున్నారు శ్రీకాంత్.

ఇటీవలే శ్రీకాంత్ నటించిన ‘కోటబొమ్మాళి పీఎస్’ సినిమా విడుదలైంది. ఎన్టీఆర్‌తో చేస్తున్న ‘దేవర’ షూటింగ్ టైమ్‌లో శ్రీకాంత్ గాయపడ్డారు. డాక్టర్లు కొంతకాలం రెస్ట్ తీసుకోమని చెప్పడంతో షూటింగ్‌కి బ్రేక్ ఇచ్చారు శ్రీకాంత్. ప్రస్తుతం శ్రీకాంత్ ఎన్టీఆర్ సినిమా దేవర, రామ్ చరణ్ సినిమా గేమ్ ఛేంజర్‌లో నటిస్తూ బిజీగా ఉన్నారు.