Sandeep Vanga : బాలీవుడ్‌పై మల్లారెడ్డి కామెంట్స్.. సందీప్ వంగా రియాక్షన్.. ఆయనకి ఏజ్ అయ్యిపోయింది..

‘యానిమల్’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో బాలీవుడ్‌పై మల్లారెడ్డి కామెంట్స్. ఆయనకి ఏజ్ అయ్యిపోయింది అంటూ సందీప్ వంగా రియాక్షన్.

Sandeep Vanga : బాలీవుడ్‌పై మల్లారెడ్డి కామెంట్స్.. సందీప్ వంగా రియాక్షన్.. ఆయనకి ఏజ్ అయ్యిపోయింది..

Sandeep Vanga about BRS leader Malla Reddy comments on bollywood

Updated On : November 29, 2023 / 11:52 AM IST

Sandeep Vanga : సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్‌లో రణబీర్ కపూర్, రష్మిక మందన్న జంటగా నటించిన ‘యానిమల్’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఇటీవల హైదరాబాద్ మల్లారెడ్డి కాలేజీలో ఘనంగా జరిగిన విషయం తెలిసిందే. ఈ ఈవెంట్‌కి చిత్ర యూనిట్ అయిన బాలీవుడ్ మెంబర్స్ రణబీర్ కపూర్, అనిల్ కపూర్, బాబీ డియోల్‌, రష్మిక మందన్నతో పాటు చీఫ్ గెస్టులుగా మంత్రి మల్లారెడ్డి, మహేష్ బాబు, రాజమౌళి కూడా హాజరయ్యారు. ఇక ఈ ఈవెంట్‌లో మల్లారెడ్డి బాలీవుడ్ ని ఉద్దేశిస్తూ చేసిన వ్యాఖ్యల వైరల్ అయ్యాయి.

మల్లారెడ్డి చేసిన కామెంట్స్.. “రణబీర్ కపూర్ వినండి, రానున్న ఐదేళ్లలో తెలుగువారు హాలీవుడ్, బాలీవుడ్‌ని ఏలుతారు. ముంబై, బాలీవుడ్ పని అయిపోయింది. బెంగళూరు ఏమో ట్రాఫిక్ జామ్ మయం. మీరు హైదరాబాద్ వచ్చేయండి. హైదరాబాద్ సిటీ దేశంలోని గొప్పదిగా ఎదుగుతుంది. మా దగ్గర రాజమౌళి, దిల్ రాజు, సందీప్ వంగా వంటి తెలివైన వారు ఉన్నారు. పుష్ప ఎంతటి సంచలనం సృష్టించిందో మీకు తెలుసు. ప్రస్తుతం తెలుగువారి అశ్వమేధ యాగం జరుగుతుంది” అంటూ వ్యాఖ్యానించారు. ఈ కామెంట్స్ పై బాలీవుడ్ ఆడియన్స్ కూడా ఫైర్ అవుతున్నారు.

Also read : Karthi : హీరో కార్తీ సినిమా వివాదం.. క్షమాపణలు చెప్పిన నిర్మాత..

తాజాగా ఈ విషయం గురించి సందీప్ వంగాని ఓ తెలుగు ఇంటర్వ్యూలో ప్రశ్నించారు. మల్లారెడ్డి మాట్లాడినట్లు ఇండస్ట్రీకి సంబంధించిన వారు ఎవరు మాట్లాడారు. రణబీర్ కోపూర్ ని ఎదురుగా పెట్టుకొని ఆయన అలా మాట్లాడినప్పుడు మీకు ఏం అనిపించింది..? అంటూ ప్రశ్నించారు. దీనికి సందీప్ వంగా బదులిస్తూ.. “ఆ వ్యాఖ్యలను నేను వేరే స్పీచ్ లా చూశాను. ఆయన ఎప్పుడు అలానే మాట్లాడుతారు. ఆయన ఏజ్ అయ్యిపోయింది. ఇప్పుడు అలానే మాట్లాడుతారు. అవి మనకి ఇబ్బంది కలిగించినా ఏం చేయలేము” అంటూ చెప్పుకొచ్చారు.

ఇది ఇలా ఉంటే, అనిల్ కపూర్ ఆ ఈవెంట్ గురించి ఒక ఎమోషనల్ ట్వీట్ చేశారు. ఈ గ్రేట్ ఈవెంట్ ని ఇంకా మర్చిపోలేకపోతున్నానని, హైదరాబాద్ ఆడియన్స్ చూపించిన ప్రేమ అద్భుతమని, ఆ ఈవెంట్ కి గెస్ట్ వచ్చినందుకు మహేష్ కి కృతజ్ఞతలు తెలియజేశారు. అలాగే తనని హీరోగా లాంచ్ చేసిన టాలీవుడ్ డైరెక్టర్ బాపుకి కృతజ్ఞతలు తెలిపారు. అనిల్ కపూర్ 1980లో బాపు దర్శకత్వంలో తెరకెక్కిన తెలుగు సినిమా ‘వంశ వృక్షం’ సినిమాలో హీరోగా నటించి కెరీర్ స్టార్ట్ చేశారు.