Harudu : ‘హరుడు’ గ్లింప్స్ రిలీజ్.. హీరోగా మళ్ళీ ప్రేక్షకుల ముందుకు వస్తున్న వెంకట్..
తాజాగా హరుడు సినిమా గ్లింప్స్ శ్రీలీజ్ చేసారు.

Actor Venkat Harudu Movie Glimpse Released
Harudu Glimpse : ఒకప్పుడు హీరోగా పలు సినిమాలతో మెప్పించిన వెంకట్ ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కొన్ని సినిమాలు చేసాడు. మధ్యలో కొంత గ్యాప్ తీసుకొని మళ్ళీ ఇటీవల సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చాడు వెంకట్. ఇప్పుడు హీరోగా మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. డాక్టర్ ప్రవీణ్ రెడ్డి నిర్మాణంలో రాజ్ తాళ్ళూరి దర్శకత్వంలో వెంకట్ హీరోగా హరుడు సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమాలో సలోని, హెబ్బా పటేల్, అలీ.. పలువురు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.
Also Read : Prakash Raj : నీ వల్ల కోటి రూపాయల నష్టం.. ప్రకాష్ రాజ్ పై నిర్మాత ఫైర్..
తాజాగా హరుడు సినిమా గ్లింప్స్ శ్రీలీజ్ చేసారు. ఈ గ్లింప్స్ చూస్తుంటే వెంకట్ పవర్ ఫుల్ పోలీసాఫీసర్ పాత్రలో నటించినట్టు తెలుస్తుంది. మాస్ ఎంటర్టైనర్ గా సినిమా ఉండబోతుంది. మీరు కూడా హరుడు గ్లింప్స్ చూసేయండి..
ఇక ఈ గ్లింప్స్ లాంచ్ ఈవెంట్లో నిర్మాత డాక్టర్ ప్రవీణ్ రెడ్డి మాట్లాడుతూ.. డైరెక్టర్ రాజ్ తాళ్లూరి రాత్రింబవళ్ళు సినిమా కోసం పనిచేశారు. ఈ సినిమా సాంగ్స్ మంచి ఆదరణ పొందుతాయి. గ్లింప్స్ చాలా బాగుంది అని అన్నారు. డైరెక్టర్ రాజ్ తాళ్ళూరి మాట్లాడుతూ.. ఐదు నిముషాల్లో కథ విని నిర్మాత ఓకే చేశారు. వెంకట్ గారితో నాకు ఐదేళ్ళ జర్నీ వుంది. లవర్ బాయ్ గా చేసిన ఆయన్ని ఇందులో మాస్ హీరోగా చూపించాను అని తెలిపారు.
హీరో వెంకట్ మాట్లాడుతూ.. ఇప్పటికే హరుడు షూట్ అయిపోయి పోస్ట్ ప్రొడక్షన్ జరుగుతుంది. నేను మొదటిసారి మాస్ పాత్ర చేశాను. నా పాత్రకు ధీటుగా హెబ్బాపటేల్ పాత్ర ఉంటుంది. స్పెషల్ సాంగ్ లో సలోని చేశారు. గతంలో షూటింగ్ లో నాకు గాయాలు అయ్యాయి. అందువల్లే కొంత గ్యాప్ తీసుకున్నాను. ఈ సినిమాలో జాగ్రత్తలు తీసుకుని ఫైట్స్ చేశాను అని తెలిపారు.