Venu Thottempudi : ఓటీటీ బాట పట్టిన ఒకప్పటి హీరో.. ‘అతిథి’ గా వస్తున్నాడు
కరోనా కాలంలో మొదలైంది ఓటీటీల హవా. అప్పటి నుంచి అప్రతిహతంగా కొనసాగుతోంది. ఓ వైపు థియేటర్లలో సినిమాలు చూసేందుకు ప్రేక్షకులు ఆసక్తి చూపిస్తున్నా మరో వైపు ఓటీటీలకు జై కొడుతున్నారు

Venu Thottempudi
Venu Thottempudi Athidhi : కరోనా కాలంలో మొదలైంది ఓటీటీల హవా. అప్పటి నుంచి అప్రతిహతంగా కొనసాగుతోంది. ఓ వైపు థియేటర్లలో సినిమాలు చూసేందుకు ప్రేక్షకులు ఆసక్తి చూపిస్తున్నా మరో వైపు ఓటీటీలకు జై కొడుతున్నారు. దీంతో పలువురు స్టార్ హీరోలు సైతం ఓటీటీల బాట పట్టడాన్ని చూస్తూనే ఉన్నాం. వెబ్ సిరీస్‌లతో ప్రేక్షకులను ఆకట్టుకునే పనిలో ఉన్నారు. తాజాగా ఆ జాబితాలో మరో హీరో చేరిపోయాడు.
‘స్వయంవరం’ చిత్రంతో టాలీవుడ్లో అడుగుపెట్టాడు వేణు తొట్టెంపూడి(Venu Thottempudi ). ఈ సినిమా ఘన విజయం సాధించడంతో వరుస అవకాశాలు క్యూ కట్టాయి. ‘చిరునవ్వుతో’, ‘పెళ్లాం ఊరెళితే’, ‘హనుమాన్ జంక్షన్’ వంటి హిట్ సినిమాల్లో నటించాడు. నటనతోనే కాకుండా తనదైన కామెడీ టైమింగ్‌తో కూడా ప్రేక్షకుల మదిలో తనదైన ముద్ర వేశాడు. అయితే.. ఉన్నట్లుండి సినిమాకు బ్రేక్ ఇచ్చాడు.
కొన్నాళ్ల విరామం తీసుకున్న తరువాత మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చాడు. ఒకటి రెండు చిత్రాల్లో సహాయ పాత్రలు చేశాడు. అయితే అవి అంతగా వర్కట్ కాలేవు. ఇటీవల రవితేజ హీరోగా వచ్చిన ‘రామారావు ఆన్ డ్యూటీ’లో పోలీస్ ఆఫీసర్‌గా కనిపించాడు. అయితే ఇది కూడా ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. ఇక ఇప్పుడు తాజాగా ఈ హీరో ఓటీటీ బాట పట్టాడు. ‘అతిథి'(Athidhi) అనే వెబ్ సిరీస్‌తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు.
డిస్నీ+హాట్‌స్టార్‌లో ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ డిస్నీ+ హాట్‌స్టార్ తాజాగా ఓ పోస్టర్‌ను విడుదల చేసింది. ఈ పోస్టర్లో విరిగిన ఓ తలుపులోంచి వేణు సగం ముఖాన్నే చూయించారు. అతడి ముఖం రక్తంతో తడిసి ఉంది. త్వరలోనే ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కానున్నట్లు తెలియజేయగా, డైరెక్టర్ ఎవరు..? ఇంకా ఎవరు నటిస్తున్నారు..? అన్న విషయాలను మాత్రం చెప్పలేదు. చూస్తుంటే ఇది ఓ క్రైమ్ థిల్లర్‌గా కనిపిస్తోంది. కాగా.. సోషల్ మీడియాలో ఈ పోస్టర్ వైరల్‌గా మారింది.
Not all GUESTS are welcome! 🚪🔥
Stay tuned for an exciting new series #ATHIDHI!#AthidhiOnHotstar
coming soon… Only on #DisneyPlusHotstar. pic.twitter.com/MJB3kGPI1P— Disney+ Hotstar Telugu (@DisneyPlusHSTel) August 21, 2023