Arjun vs Vishwak : అర్జున్ సర్జా ఆరోపణలపై స్పందించిన నటుడు విశ్వక్ సేన్..

సీనియర్ హీరో యాక్షన్ కింగ్ అర్జున్ దర్శకత్వంలో తన కూతురు హీరోయిన్ గా, విశ్వక్ సేన్ హీరోగా ఇటీవల ఓ సినిమాని లాంచ్ చేశారు. ఈ సినిమాని పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా లాంచ్ చేశారు. పలువురు సినీ ప్రముఖులు ఈ సినిమా ఓపెనింగ్ కార్యక్రమానికి వచ్చారు. కాగా విశ్వక్ ఈ సినిమా నుంచి తప్పుకోవడంతో టాలీవుడ్ లో వివాదం చెలరేగింది. దర్శకనిర్మాత అర్జున్ నిన్న ప్రెస్ మీట్ పెట్టి విశ్వక్ పై తీవ్ర ఆరోపణలు చేశాడు. తాజాగా ఈ విషయంపై హీరో విశ్వక్ స్పందించాడు.

Arjun vs Vishwak : అర్జున్ సర్జా ఆరోపణలపై స్పందించిన నటుడు విశ్వక్ సేన్..

Actor Vishwak Sen reacts to Arjun Sarja's allegations

Updated On : November 6, 2022 / 10:08 PM IST

Arjun vs Vishwak : సీనియర్ హీరో యాక్షన్ కింగ్ అర్జున్ దర్శకత్వంలో తన కూతురు హీరోయిన్ గా, విశ్వక్ సేన్ హీరోగా ఇటీవల ఓ సినిమాని లాంచ్ చేశారు. ఈ సినిమాని పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా లాంచ్ చేశారు. పలువురు సినీ ప్రముఖులు ఈ సినిమా ఓపెనింగ్ కార్యక్రమానికి వచ్చారు. కాగా విశ్వక్ ఈ సినిమా నుంచి తప్పుకోవడంతో టాలీవుడ్ లో వివాదం చెలరేగింది.

Arjun vs Vishwak : అర్జున్ వ్యాఖ్యలకి స్పందించిన విశ్వక్ సేన్ టీం?? అందుకే సినిమా నుంచి తప్పుకున్నాడు..

దర్శకనిర్మాత అర్జున్ నిన్న ప్రెస్ మీట్ పెట్టి విశ్వక్ పై తీవ్ర ఆరోపణలు చేశాడు. తాజాగా ఈ విషయంపై హీరో విశ్వక్ స్పందించాడు. ఏ ఎమ్ బి సినిమాస్ లో ‘రాజయోగం’ మూవీ టీజర్ లాంచ్ ఈవెంట్ కు ముఖ్య అతిథిగా హాజరైన విశ్వక్ సేన్.. వివాదం గురించి మాట్లాడాడు. “నిన్న జరిగిన అలజడికి రెండు మూడు రోజులు హిమాలయాలకు వెళ్ళిపోదాం అనిపించింది. నేను కమిటెడ్ ప్రొఫెషనల్ యాక్టర్ ని, ప్రతి సినిమాని నాది అనుకొని చేస్తాను.

ఎవరైనా నాతో సినిమా చేసిన వాళ్ళు నేను కమిటెడ్ కాదని అంటే నేను అక్కడ ఉండలేను. నేను ఆ సినిమాకి నా వంతు ఎఫార్ట్ పెట్టీ చేద్దాము అనుకున్నా. కానీ మా ఇద్దరి మధ్య సరైన కోఆర్డినేషన్ లేదు. ఆ విషయం నేను లేటుగా రియలైజ్ అయ్యాను. వాళ్ల మేనేజర్ రెండు రోజుల తరువాత మాకు కాల్ చేసి రెమ్యునరేషన్ వెనక్కి పంపించమని చెప్పాడు. నా వల్ల ఏ నిర్మాత డబ్బులు పోగొట్టు కోలేదు.

నేను సినిమా బాగా రావడానికి మాట్లాడుకుందామని మెసేజ్ పెట్టాను. సెట్ మీద డిస్కర్షన్ రావద్దు అని రెండు రోజులు మాట్లాడుకొని వెళ్దామని చెప్పాను. అర్జున్ గారు మంచి సినిమా చెయ్యాలి, అయన బాగుండాలి. కానీ సెట్ లో కంఫర్ట్ లేకుండా చేయలేను. నా పరిస్తితి ఏంటో మీకు చెప్పాను తప్పా, రైటా అనేది ఇప్పుడు మీరే చెప్పండి” అంటూ వ్యాఖ్యానించాడు.