Suresh Kondeti : రిపోర్టర్ కి కౌంటర్ ఇచ్చిన డింపుల్.. వరుస కౌంటర్లు పడుతున్నా ఈ రిపోర్టర్ మారడా?

కొంతమంది అయితే తాము పాపులర్ అవ్వడానికి సినిమావాళ్లని ఇబ్బంది పెడుతూ ప్రశ్నలు అడుగుతూ వైరల్ అవుతున్నారు. ఇటీవల సురేష్ కొండేటి వరుసగా వివాదాల్లో నిలుస్తున్నారు. సినిమా ప్రెస్ మీట్స్ లో హీరో, హీరోయిన్స్ ని ఇబ్బందికరమైన ప్రశ్నలు అడుగుతూ వార్తల్లో నిలుస్తున్నారు.

Suresh Kondeti : రిపోర్టర్ కి కౌంటర్ ఇచ్చిన డింపుల్.. వరుస కౌంటర్లు పడుతున్నా ఈ రిపోర్టర్ మారడా?

Actors giving counters to Suresh Kondeti Questions in Press meets

Updated On : April 27, 2023 / 12:58 PM IST

Suresh Kondeti : అప్పుడప్పుడు సినిమా వాళ్ళు ఇచ్చే ఇంటర్వ్యూలలో(Interview) ప్రశ్నలు అడిగేవాళ్ళు ఇబ్బందికరమైన, కాంట్రవర్సీ ప్రశ్నలు అడుగుతూనే ఉంటారు. అవతలి వాళ్ళు ఏమనుకుంటారో అని లేకుండా ఒక్కోసారి వాళ్ల లిమిట్ దాటి మరీ ప్రశ్నలు అడుగుతారు. ఇటీవల ఇది మరీ ఎక్కువైంది. కొంతమంది అయితే తాము పాపులర్ అవ్వడానికి సినిమావాళ్లని ఇబ్బంది పెడుతూ ప్రశ్నలు అడుగుతూ వైరల్ అవుతున్నారు.

అందులో ఇప్పుడు ముందు వరసలో ఉండేది ప్రముఖ సినిమా జర్నలిస్ట్, PR సురేష్ కొండేటి. సినిమా జర్నలిస్ట్ గా ప్రస్థానం మొదలుపెట్టి నటుడిగా, నిర్మాతగా, PRగా ఎదిగారు. సంతోషం మ్యాగజైన్, అవార్డులతో మంచి పేరు తెచ్చుకున్నారు సురేష్ కొండేటి. కానీ ఇటీవల సురేష్ కొండేటి వరుసగా వివాదాల్లో నిలుస్తున్నారు. సినిమా ప్రెస్ మీట్స్ లో హీరో, హీరోయిన్స్ ని ఇబ్బందికరమైన ప్రశ్నలు అడుగుతూ వార్తల్లో నిలుస్తున్నారు.

గతంలో DJ టిల్లు సినిమా ప్రమోషన్స్ సమయంలో హీరోయిన్ నేహశెట్టిని లిప్ కిస్ గురించి కామెంట్స్ చేసి వైరల్ అవ్వడంతో అందరూ సురేష్ కొండేటిని విమర్శించారు. టాలీవుడ్ ప్రముఖులు కూడా ఇది తప్పు అని కౌంటర్లు వేయడంతో చివరకు సారీ చెప్పాడు. ఆ తర్వాత నాని ప్రెస్ మీట్ లో కూడా ఏదో మాట్లాడితే నాని కౌంటర్ ఇచ్చాడు. ఇటీవల సాయి ధరమ్ తేజ్ విరూపాక్ష సినిమా ప్రమోషన్స్ లో.. తేజ్, సంయుక్త రొమాంటిక్ సీన్స్ ఉన్నాయా? A
సర్టిఫికెట్ ఎందుకు ఇచ్చారు అంటూ ప్రశ్నించడంతో తేజ్ గట్టిగా కౌంటర్ ఇచ్చాడు. దీంతో ఏం సమాధానం చెప్పాలో తెలియక తెల్లమొహం వేశాడు.

తాజాగా ఇప్పుడు రామబాణం ప్రమోషన్స్ లో డింపుల్ సినిమాలో, బయట పద్దతిగా కనిపిస్తున్నా కూడా సురేష్ మీరు వల్గర్ గా కనిపిస్తున్నారు అని డింపుల్ ని ఉద్దేశించి అన్నాడు. దీంతో డింపుల్.. వల్గర్ అంటారేంటి? సినిమాలో ఇప్పటివరకు నా నుంచి అలాంటి సీన్స్ ఏమన్నా వచ్చాయా? ఇందులో ఫ్యామిలీ పాత్రలో చేశాను. ప్రమోషన్స్ లో కూడా శుభ్రంగానే ఉన్నాను అంటూ గట్టిగానే సమాధానం ఇచ్చింది.  డైరెక్టర్ శ్రీవాస్ కూడా.. ఆ అమ్మాయిని అలా అంటారనే ప్రమోషన్స్ కి కూడా ఇలా పద్దతిగా వస్తుంది. చాలా మంచి ఫ్యామిలీ క్యారెక్టర్ అని సురేష్ కి కౌంటర్ ఇచ్చాడు. దీంతో సురేష్ కి ఏం చెప్పాలో తెలియలేదు.

Amala Paul : కథ డిమాండ్ చేస్తే న్యూడ్ గా నటించేందుకు కూడా సిద్దమే.. అమలాపాల్!

ఇలా వరుసగా నటులను ఇబ్బంది పెట్టే, అసహనానికి గురిచేసే ప్రశ్నలు వేస్తూ అందరితో తిట్టించుకుంటున్నాడు సురేష్ కొండేటి. దీంతో రెగ్యులర్ గా సోషల్ మీడియాలో ఆయా హీరో, హీరోయిన్స్ అభిమానులు సురేష్ ని విమర్శిస్తూ ట్రోల్ చేస్తున్నారు. ఇంతమంది కౌంటర్లు ఇస్తున్నా ఇతను మారడా? పబ్లిసిటీ కోసం మరి ఇంత చీప్ గా ప్రశ్నలు అడగాలా అని కామెంట్స్ చేస్తున్నారు.