Actress Anitha: భర్త చెంప పగలగొట్టిన నటి

గతంలో భార్య భర్తల గేమ్స్ నాలుగు గోడల మధ్య జరిగేవి.. సోషల్ మీడియా పుణ్యమా అని ఇప్పుడు వారి ఆట, పాటలు నెట్టింట్లోకి వచ్చి సందడి చేస్తున్నాయి. కాగా తాజాగా బుల్లితెర నటి అనిత షేర్ చేసిన వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది.

Actress Anitha: భర్త చెంప పగలగొట్టిన నటి

Actor Anitha

Updated On : May 24, 2021 / 12:27 PM IST

Actress Anitha: గతంలో భార్య భర్తల గేమ్స్ నాలుగు గోడల మధ్య జరిగేవి.. సోషల్ మీడియా పుణ్యమా అని ఇప్పుడు వారి ఆట, పాటలు నెట్టింట్లోకి వచ్చి సందడి చేస్తున్నాయి. కాగా తాజాగా బుల్లితెర నటి అనిత షేర్ చేసిన వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. మ్యాజిక్ ట్రిక్ పేరుతో భర్త చెంప చెళ్లుమనిపించింది అనిత.. మొదట భర్తను రోహిత్ రెడ్డిని కుర్చీలో కూర్చోబెట్టిన అనిత చేతిలో దారం ఉన్నట్లుగా నటించింది. ఆ దారాన్ని భర్త రోహిత్ చెవిలోంచి తీస్తున్నట్లుగా యాక్ట్ చేసింది.

ఓ చేయితో అనిత, మరో చేత్తో రోహిత్ దారం పట్టుకున్నట్లు నటించారు. ఇంతలోనే అనిత 1,2,3 లు లెక్కపెట్టింది.. దీంతో రోహిత్ ఒక్కసారిగా తన చేయిని లాగాడు. దీంతో అనిత రోహిత్ చెంప చెళ్లుమనిపించింది. షాకైన భర్త తనను ఏమీ అనలేక అక్కడ నుంచి వెళ్లిపోయాడు. భార్యలకు ఈ మ్యాజిక్‌ ట్రిక్‌ తప్పకుండా నచ్చుతుందన్న అనిత ‘ఈ ట్రిక్‌ను ప్రయత్నించండి’ అని వీడియోకు క్యాప్షన్‌ ఇస్తూ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. కాగా ఈ వీడియోకు లక్షల్లో వ్యూస్ వచ్చాయి.

అయితే తనను ఇలా ఆడేసుకున్న భార్యను ఊరుకునేది లేదంటున్నాడు రోహిత్‌. త్వరలోనే ప్రతీకారం తీర్చుకుంటానని స్వీట్ వార్నింగ్‌ ఇచ్చాడు. భర్తను ఆటపట్టించడం చూసి నెటిజన్లు ఫన్నీగా నవ్వుకుంటున్నారు. రోహిత్ ఎలా రివేంజ్‌ తీసుకుంటాడా అని ఎదురు చూస్తున్నామని చెప్తున్నారు. కాగా అనిత 2013లో రోహిత్ ను పెళ్లిచేసుకున్నారు. ఈ జంట ఈ ఏడాది ఫిబ్రవరి 9న మగబిడ్డకు జన్మనిచ్చింది. ‘నువ్వు నేను’, ‘శ్రీరామ్‌’, ‘నేనున్నాను’ వంటి చిత్రాల్లో అనిత నటించారు.

 

View this post on Instagram

 

A post shared by Anita H Reddy (@anitahassanandani)