Sonu Sood: ప్రధాని కావాలంటూ బాలీవుడ్ నటి.. సోనూసూద్ రియాక్షన్ ఇదే!
కష్టాల్లో ఉన్నాం అంటే చాలు.. వెంటనే స్పందించి చేతనైన సాయం చేస్తున్న నటుడు సోనూసూద్.. సామాన్య ప్రజలకు.. సెలబ్రిటీలకు అనే తేడా లేకుండా పనిచేస్తున్న సోనూసూద్‍ను ప్రశంసించేవారు కూడా ఎక్కువే అవుతున్నారు.

Actress Huma Qureshi Wants Sonu Sood To Be The Prime Minister Of India
Sonu Sood for Prime Minister: కష్టాల్లో ఉన్నాం అంటే చాలు.. వెంటనే స్పందించి చేతనైన సాయం చేస్తున్న నటుడు సోనూసూద్.. సామాన్య ప్రజలకు.. సెలబ్రిటీలకు అనే తేడా లేకుండా పనిచేస్తున్న సోనూసూద్‍ను ప్రశంసించేవారు కూడా ఎక్కువే అవుతున్నారు. ఈ క్రమంలోనే లేటెస్ట్‌గా బాలీవుడ్ నటి హుమా ఖురేషి కూడా సోనూసూద్‌పై ప్రశంసలు కురిపించారు. ప్రభుత్వాలకు ధీటుగా సాయం చేస్తున్న సోనూసూద్ ప్రధాని కావాలనే అభిప్రాయాన్ని వ్యక్తంచేశారు.
ప్రస్తుతం హుమా ఖురేషీ ‘మహారాణి’ అనే రాజకీయాలపై ఆధారపడిన సినిమాలో ముఖ్యమంత్రి పాత్ర పోషించింది. ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమంలో ఖురేషీ ఈ రకమైన వ్యాఖ్యలు చేశారు. హుమా ఖురేషీనే కాదు.. రాఖీసావంత్ ఇలా ఎంతోమంది నటీమణులు సోనూసూద్ ప్రధాని కావాలంటూ అభిప్రాయపడ్డారు.
ఖురేషి వ్యాఖ్యలపై స్పందించిన సోనూ..‘‘హుమా ఖురేషీ అలా చెప్పడం ఆమె మంచి మనసుకు నిదర్శనం. ఈ గౌరవానికి అర్హుడిని అని కొందరు అనుకుంటే మాత్రం, నేను తప్పక ఏదైనా మంచిపని చేశానని నమ్మాలి. కానీ ఆమె మాటలతో ఏకీభవించను. మన దేశానికి ఇప్పుడు సమర్ధవంతమైన ప్రధాని ఉన్నారు. ఇంకా నాకు అంత వయసు లేదు. నేను చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి.” అని చెప్పుకొచ్చారు.
నేను రాజకీయాల్లోకి రావడం ఇష్టంలేని వారు అక్కడ చాలామంది ఉన్నారు. నా గురించి వారు కలత చెందాలని కోరుకోవట్లేదు. నా పని నేను చేసుకోవడం ఉత్తమం. నటుడిగా హ్యాపీగా ఉన్నాను. సామాన్యుల కష్టాలు తీర్చేందుకు నావంతుగా ప్రయత్నం చేస్తున్నాను. అధికారం, పదవి లేకుండా కూడా మంచి పనులు చేయవచ్చునని సోనూసూద్ అన్నారు.