Ileana D’Cruz : రెండోసారి ప్రగ్నెంట్ అయిన హీరోయిన్.. బేబీ బంప్ ఫోటో వైరల్..

ప్రస్తుతం ఇలియానా రెండోసారి ప్రగ్నెంట్ అని తెలుస్తుంది.

Ileana D’Cruz : రెండోసారి ప్రగ్నెంట్ అయిన హీరోయిన్.. బేబీ బంప్ ఫోటో వైరల్..

Ileana D'Cruz Second Time Pregnant

Updated On : May 29, 2025 / 11:42 AM IST

Ileana D’Cruz : ఒకప్పటి స్టార్ హీరోయిన్ ఇలియానా ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. మైఖేల్ డోలన్ అనే విదేశీయుడితో డేటింగ్ లో ఉన్న ఇలియానా 2023 లో ఓ బాబుకు జన్మనిచ్చింది. ఆ సమయంలో తన బాబుకు ఫీనిక్స్ డోలన్ అని పేరు పెట్టినట్టు, తన ఫొటోలు కూడా షేర్ చేసి తెలిపింది. గత సంవత్సరం తన బాబు మొదటి పుట్టిన రోజు వేడుకల ఫొటోలు కూడా షేర్ చేసింది.

Also Read : Mass Jathara : రవితేజ ‘మాస్ జాతర’ రిలీజ్ డేట్ వచ్చేసింది.. ఆ పండక్కి థియేటర్స్ లో సందడి..

ప్రస్తుతం ఇలియానా రెండోసారి ప్రగ్నెంట్ అని తెలుస్తుంది. తాజాగా ఇలియానా ఫ్రెండ్ తో కలిసి దిగిన ఫోటోని తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో పోస్ట్ చేసింది. ఈ ఫొటోలో ఇద్దరూ బేబీ బంప్స్ తో ఉన్నారు. ఈ ఫోటో షేర్ చేసి ఇలియానా.. బంప్ బడ్డీస్ అని రాసుకొచ్చింది. దీంతో త్వరలోనే ఇలియానా రెండోసారి తల్లి కాబోతుందని తెలుస్తుంది. పలువురు అభిమానులు, నెటిజన్లు ఈ సందర్భంగా ఇలియానాకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

Ileana D'Cruz Second Time Pregnant

Also Read : Gaddar Awards : గద్దర్ అవార్డులు అనౌన్స్.. ఉత్తమ నటుడు అల్లు అర్జున్, ఉత్తమ చిత్రం కల్కి2898AD.. ఫుల్ డీటెయిల్స్..