Kalyani Priyadarshan : ఆ సినిమా గాయాలు ఇంకా తగ్గలేదంటూ ఎమోషనల్ పోస్టు

నటి కళ్యాణి ప్రియదర్శన్ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారు. తాజాగా తన కాలికి గాయాలున్న ఫోటోను షేర్ చేస్తూ ఎమోషనల్ గా ట్వీట్ చేశారు.

Kalyani Priyadarshan

Kalyani Priyadarshan : హీరో అఖిల్ అక్కినేనికి జోడీగా ‘హలో’ సినిమాతో అరంగేట్రం చేసారు నటి కళ్యాణి ప్రియదర్శన్. తెలుగు, తమిళ, మళయాళ సినిమాల్లో నటించిన ఈ నటి సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారు. రీసెంట్‌గా కళ్యాణి ప్రియదర్శన్ ఎమోషనల్‌గా పెట్టిన పోస్టు వైరల్ అవుతోంది.

Vijay Deverakonda : సంక్రాంతి బరిలో ‘ఫ్యామిలీ స్టార్’ లేనట్లేనా? క్లారిటీ ఇచ్చిన దిల్ రాజు

2017 లో ‘హలో’ సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు కళ్యాణి ప్రియదర్శన్. ఆమె ప్రముఖ దర్శకుడు ప్రియదర్శన్, నటి లిజి దంపతుల కుమార్తె అని అందరికీ తెలుసు.  తెలుగు, తమిళ భాషలో నటించారు. హలో తర్వాత చిత్రలహరి, రణరంగంతో పాటు చివరిగా ‘చల్ మోహన్ రంగ’ సినిమాలో నటించారు. తమిళంలో హీరో, పుత్తం పుదు కాలాయి, మానాడు సినిమాలు.. మళయాళంలో వారనే ఆవశ్యమును, బ్రో డాడీ వంటి సినిమాల్లో చేశారు. తాజాగా కళ్యాణి ప్రియదర్శన్ నటించిన ‘ఆంటోనీ’ మళయాళ సినిమా డిసెంబర్ 1 న రిలీజైంది. ఈ సినిమా రిలీజ్ తర్వాత ఆమె సోషల్ మీడియాలో తన కాలికి కట్టుతో ఉన్న ఫోటోను పోస్టు చేయడం వైరల్‌గా మారింది.

Nithin : ‘నాకు పెళ్లైంది.. నా డబ్బు నాకు రావాల్సిందే’ తండ్రిని ప్రశ్నించిన నటుడు

కళ్యాణి ప్రియదర్శన్ తాజాగా ‘ఆంటోనీ’ అనే మళయాళ సినిమాలో బాక్సింగ్ ప్లేయర్‌గా నటించారు. పూర్తి స్ధాయి యాక్షన్ డ్రామాగా వచ్చిన ఈ సినిమాని ఐన్‌స్టీన్ మీడియా, నెక్స్‌టెల్ స్టూడియోస్, అల్ట్రా మీడియా ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మించాయి. జోషి ఈ సినిమాని డైరెక్ట్ చేశారు. ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అయ్యింది. ఈ సినిమా యాక్షన్స్ సీన్స్‌లో కళ్యాణి గాయపడినట్లు గతంలో వార్తలు వచ్చాయి. తాజాగా ఆ గాయాల తాలుకూ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్టు చేస్తూ కళ్యాణి ఎమోషనల్ అయ్యారు. ‘కంఫర్ట్ జోన్‌లో పెరుగుదల లేదు.. గ్రోత్ జోన్‌లో సౌకర్యం లేదు.. ఇది నాకు ఆలస్యంగా అర్ధమైంది.. పంచ్‌లు నిజమయ్యాయి.. కిక్‌లు నిజమయ్యాయి.. గాయాలు నిజమే.. కన్నీళ్లు నిజమయ్యాయి.. చిరునవ్వులు నిజమైనవి.. అయితే రక్తం నిజం కాదు.. క్లాప్‌లు కొట్టినందుకు ధన్యవాదాలు అబ్బాయిలు.. అరుపులకు ధన్యవాదాలు.. అన్నింటికంటే ఆన్ లైన్లో మీరు చూపిస్తున్న ప్రేమకు ధన్యవాదాలు’ అని ఆంటోనీ టైటిల్ ట్యాగ్ చేస్తూ కళ్యాణి పోస్టు చేశారు. ఆమె పోస్టు ఇప్పుడు వైరల్ అవుతోంది.