Vijay Deverakonda : సంక్రాంతి బరిలో ‘ఫ్యామిలీ స్టార్’ లేనట్లేనా? క్లారిటీ ఇచ్చిన దిల్ రాజు

విజయ్ దేవరకొండ సినిమా 'ఫ్యామిలీ స్టార్' సంక్రాంతి బరిలో ఉందని అంతా అనుకున్నారు. అయితే ఈ సినిమా రిలీజ్‌పై నిర్మాత దిల్ రాజు క్లారిటీ ఇచ్చారు.

Vijay Deverakonda : సంక్రాంతి బరిలో ‘ఫ్యామిలీ స్టార్’ లేనట్లేనా? క్లారిటీ ఇచ్చిన దిల్ రాజు

Vijay Deverakonda

Updated On : December 3, 2023 / 12:26 PM IST

Vijay Deverakonda : విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ నటించిన ‘ఫ్యామిలీ స్టార్’ 2024 సంక్రాంతికి రిలీజ్ అంటూ మొదట వార్తలు వచ్చాయి. ఇప్పటికే సంక్రాంతి బరిలో పెద్ద సినిమాలు పోటీ చేస్తుండగా ఈ సినిమా వాయిదా వేస్తున్నట్లు దిల్ రాజు ప్రకటించారు.

Nithin : ‘నాకు పెళ్లైంది.. నా డబ్బు నాకు రావాల్సిందే’ తండ్రిని ప్రశ్నించిన నటుడు

విజయ్ దేవరకొండ ఫుల్ ఫ్యామిలీ మేన్‌గా నటిస్తున్న చిత్రం ‘ఫ్యామిలీ స్టార్’. మృణాల్ ఠాకూర్ జోడీగా నటిస్తున్నారు. ‘గీతగోవిందం’ సినిమా తర్వాత పరశురామ్ డైరెక్షన్‌లో విజయ్ చేస్తున్న సినిమా ఇది. దిల్ రాజు ఈ సినిమాను ప్రొడ్యూస్ చేస్తున్నారు. అక్టోబర్ లో ఫ్యామిలీ స్టార్ సినిమా నుంచి టీజర్ రిలీజ్ చేసారు మేకర్స్. పిల్లల్ని ప్రేమించే తండ్రిగా ఈ టీజర్‌లో విజయ్ కనిపించారు. కామెడీ, యాక్షన్ ఫ్యామిలీ చిత్రంగా వస్తున్న ఫ్యామిలీ స్టార్ మూవీ మొదట 2024 లో సంక్రాంతికి రిలీజ్ కాబోతోందని వార్తలు వచ్చాయి. తాజాగా చిత్ర నిర్మాత దిల్ రాజు ఈ సినిమా రిలీజ్ డేట్ మీద క్లారిటీ ఇచ్చారు.

Mahesh Babu : జిమ్‌లో పెంపుడు కుక్కతో కలిసి మహేష్ బాబు కసరత్తులు

ఫ్యామిలీ స్టార్ డిలే రూమర్లపై దిల్ రాజు స్పందించారు. ఫ్యామిలీ స్టార్ సినిమా షూటింగ్ కోసం USA వీసాలతో సమస్యలు వచ్చాయని అయితే ఆవి సాల్వ్ అయ్యాయని.. 15 రోజుల పాటు షూటింగ్ కోసం టీమ్ యునైటెడ్ స్టేట్స్ వెళ్తోందని దిల్ రాజు చెప్పారు. టీమ్ డిసెంబర్ 19 న తిరిగి వచ్చినా మరో 15 రోజులు షెడ్యూల్ మిగిలి ఉంటుందని.. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని సినిమా వాయిదా వేస్తున్నామంటూ దిల్ రాజు స్పష్టం చేశారు. 2024 సమ్మర్‌లో ఈ సినిమా విడుదల చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.