Kalyani : డైరెక్టర్ గా మారుతున్న సీనియర్ నటి కళ్యాణి

పలు చిన్న సినిమాల్లో హీరోగా నటించిన యువ నటుడు చేతన్‌ చీను కథానాయకుడిగా కల్యాణి దర్శకురాలిగా ఈ సినిమాని తెరకెక్కించనున్నారు. ఇటీవల ఈ సినిమాకి సంబంధించిన కొన్ని పోస్టర్స్ ని.........

Kalyani :  డైరెక్టర్ గా మారుతున్న సీనియర్ నటి కళ్యాణి

Kalyani

Updated On : February 16, 2022 / 12:04 PM IST

Chethan Cheenu :  మలయాళీ భామ, ఒకప్పటి హీరోయిన్ కళ్యాణి తెలుగులో ఎన్నో మంచి సినిమాలు చేశారు. హీరోయిన్ గా కెరీర్ ముగిసిన తర్వాత కూడా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సినిమాలు చేస్తూనే ఉన్నారు. ఔను వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు, వసంతం, కబడ్డీ కబడ్డీ లాంటి సూపర్ హిట్ సినిమాలతో మెప్పించి ఇప్పుడ్ఫు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా మెప్పిస్తున్నారు కళ్యాణి. గతంలో కొన్ని సినిమాలకి నిర్మాతగా కూడా వ్యవహరించారు. తాజాగా మెగాఫోన్ పట్టబోతున్నారు కళ్యాణి.

పలు చిన్న సినిమాల్లో హీరోగా నటించిన యువ నటుడు చేతన్‌ చీను కథానాయకుడిగా కల్యాణి దర్శకురాలిగా ఈ సినిమాని తెరకెక్కించనున్నారు. ఇటీవల ఈ సినిమాకి సంబంధించిన కొన్ని పోస్టర్స్ ని కూడా రిలీజ్ చేశారు. ఈ సినిమాకి కళ్యాణి నిర్మాతగా కూడా వ్యవహరించనున్నారు. తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ భాషల్లో ఈ సినిమా రూపొందుతుంది. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది ఈ సినిమా. ఇంకా సినిమాకి టైటిల్ ని ఖరారు చేయలేదు.

Ashu Reddy : హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తున్న అషూరెడ్డి

ఇప్పటికే హీరో భారత స్వాతంత్య్ర్యం కోసం పోరాడిన వ్యక్తుల గెటప్స్ తో వేసిన లుక్స్ రిలీజ్ చేసిన ఈ సినిమా టీం తాజాగా వ్యాలెంటైన్స్ డే సందర్భంగా మరో ఇంట్రెస్టింగ్ పోస్టర్ ని రిలీజ్ చేశారు. ఇందులో హీరో చేతన్ చీను నగ్నంగా కూర్చున్న ఫోటోని రిలీజ్ చేశారు. ప్రేమ, సస్పెన్స్‌, థ్రిల్లర్‌ అంశాల తో కూడిన సినిమాగా తెరకెక్కబోతుంది సమాచారం. టైటిల్ ఖరారు చేయని ఈ సినిమా త్వరలో షూటింగ్ ముగించుకొని ఈ సంవత్సరమే విడుదల కానుంది.