Rashmika Mandana : ర‌ష్మిక కాళ్లు మొక్కిన అసిస్టెంట్‌.. వైర‌ల్ అవుతున్న వీడియో

టాలీవుడ్‌లో ప్ర‌స్తుతం ఉన్న టాప్ హీరోయిన్ల‌లో ర‌ష్మిక మంద‌న్న (Rashmika Mandana) ఒక‌రు. పుష్ప సినిమాతో నేష‌న‌ల్ క్ర‌ష్‌గా మారిపోయింది.

Rashmika Mandana : ర‌ష్మిక కాళ్లు మొక్కిన అసిస్టెంట్‌.. వైర‌ల్ అవుతున్న వీడియో

Rashmika Mandanna assistant marriage

Updated On : September 4, 2023 / 2:24 PM IST

Rashmika Mandanna assistant marriage : టాలీవుడ్‌లో ప్ర‌స్తుతం ఉన్న టాప్ హీరోయిన్ల‌లో ర‌ష్మిక మంద‌న్న (Rashmika Mandana) ఒక‌రు. పుష్ప సినిమాతో నేష‌న‌ల్ క్ర‌ష్‌గా మారిపోయింది. తెలుగు, త‌మిళ, హిందీ బాష‌ల్లో న‌టిస్తూ య‌మా బిజీగా ఉంది. తాజాగా త‌న మేక‌ప్ అసిస్టెంట్ పెళ్లికి హాజ‌రైంది. అక్క‌డ ఈ క‌న్న‌డ భామ చేసిన సంద‌డి ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.

Devil Movie Sets : కళ్యాణ్ రామ్ ‘డెవిల్’ సినిమా కోసం ఏకంగా 80 భారీ సెట్స్..

ర‌ష్మిక మేక‌ప్ అసిస్టెంట్ పెళ్లి హైద‌రాబాద్‌లో జ‌రిగింది. ఈ పెళ్లికి ప‌సుపు రంగు చీర క‌ట్టుకుని సంప్ర‌దాయ ప‌ద్ద‌తిలో హాజ‌రైంది. కొత్త దంప‌తుల‌కు ర‌ష్మిక శుభాకాంక్ష‌లు చెప్పింది. వారు ఆమె కాళ్లు మొక్కారు. దీంతో ఆమె కాస్త కంగారు ప‌డింది. ఆ త‌రువాత వాళ్ల‌ను ఆశీర్వ‌దించారు. ఈ వీడియోను ప్ర‌స్తుతం నెట్టింట తెగ షేర్ చేసుకుంటున్నారు. దీనిపై నెటీజ‌న్లు స‌ర‌దా కామెంట్లు చేస్తున్నారు. బిజీ షెడ్యూల్‌లోనూ అసిస్టెంట్ పెళ్లికి హాజ‌రు కావ‌డంపై నెటీజ‌న్లు ప్ర‌సంశ‌లు కురిపిస్తున్నారు.

Pallavi Prashanth : బిగ్‌బాస్ సీజన్ 7లో పదమూడవ కంటెస్టెంట్.. పల్లవి ప్రశాంత్.. రైతు బిడ్డ అని చెప్పుకుంటూ..

ఇదిలా ఉంటే.. ఇటీవ‌లే ఓ ఇంట‌ర్వ్యూలో ర‌ష్మిక త‌న పెళ్లిపై స్పందించింది. త‌న వివాహ‌నికి ఇంకా చాలా స‌మ‌యం ఉంద‌ని చెప్పింది. ప్ర‌స్తుతం త‌న దృష్టి అంతా కెరీర్‌పైనే ఉంద‌ని చెప్పింది. ప్ర‌స్తుతం ర‌ష్మిక.. అల్లు అర్జున్ హీరోగా తెర‌కెక్కుతున్న ‘పుష్ప 2’ చిత్రంతో పాటు సందీప్ వంగా ద‌ర్శ‌క‌త్వంలో ర‌ణ్‌బీర్ క‌పూర్ హీరోగా రానున్న ‘యానిమ‌ల్’ సినిమాలోనూ న‌టిస్తోంది. వీటితో పాటు లేడి ఓరియంటెడ్ సినిమా ‘రెయిన్ బో’ లో న‌టిస్తుంది.