Devil Movie Sets : కళ్యాణ్ రామ్ ‘డెవిల్’ సినిమా కోసం ఏకంగా 80 భారీ సెట్స్..

ఈ పీరియాడిక్ మూవీ కోసం మేకర్స్ భారీ సెట్స్ ను వేశారు. ఈ సెట్స్ చూస్తుంటే సినిమాపై మరింత ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. 'డెవిల్' మూవీ కోసం 80 సెట్స్ వేయటం విశేషం.

Devil Movie Sets : కళ్యాణ్ రామ్ ‘డెవిల్’ సినిమా కోసం ఏకంగా 80 భారీ సెట్స్..

Nandamuri Kalyan Ram Devil Movie Art Director Gandhi Construct 80 Periodic sets for movie Producer Abhishek Nama gives Full support in Budget

Devil Movie Sets :  వైవిధ్యమైన సినిమాలు చేస్తూ తనదైన గుర్తింపు సంపాదించుకున్న హీరో నందమూరి కళ్యాణ్ రామ్(Nandamuri Kalyan Ram) టైటిల్ పాత్రలో నటిస్తోన్న భారీ బడ్జెట్ చిత్రం ‘డెవిల్”. బ్రిటీష్ సీక్రెట్ ఏజెంట్ అనేది ట్యాగ్ లైన్. స్వాతంత్ర్యానికి ముందు కథాంశంతో రూపొందుతుంది ఈ సినిమా. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన గ్లింప్స్ భారీ అంచనాలను నెలకొల్పింది.

ఈ పీరియాడిక్ మూవీ కోసం మేకర్స్ భారీ సెట్స్ ను వేశారు. ఈ సెట్స్ చూస్తుంటే సినిమాపై మరింత ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ‘డెవిల్’ మూవీ కోసం 80 సెట్స్ వేయటం విశేషం. ఈ సినిమాను 1940 బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కించారు. కాబట్టి దానికి తగ్గట్లు సెట్స్ ను రూపొందించారు. ఆర్ట్ డైరెక్టర్ గాంధీ ఈ చిత్రానికి సెట్స్ ను రూపొందించారు.

బ్రిటీష్ పరిపాలనలో మన దేశం ఉన్నసయమానికి చెందిన సెట్స్ వేయటం తనకెంతో ఛాలెంజింగ్ గా అనిపించిందని ఆర్ట్ డైరెక్టర్ గాంధీ పేర్కొన్నారు. తమిళనాడు, కర్ణాటక, కేరళ, రాజస్థాన్ వంటి పలు ప్రాంతాల నుంచి సెట్స్ ను రూపొందించటానికి కావాల్సిన సామాగ్రిని తెప్పించారు. నిర్మాత అభిషేక్ నామాగారి సపోర్ట్ లేకుండా ఈ రేంజ్ లో భారీ సెట్ వేసి సినిమా రిచ్ గా తెరకెక్కించటం సాధ్యమయ్యేది కాదని ఆర్ట్ డైరెక్టర్ తెలిపారు.

Nandamuri Kalyan Ram Devil Movie Art Director Gandhi Construct 80 Periodic sets for movie Producer Abhishek Nama gives Full support in Budget

Devil : డెవిల్ గ్లింప్స్ రిలీజ్.. నందమూరి అభిమానులకు కళ్యాణ్ రామ్ బర్త్‌డే గిఫ్ట్..

‘డెవిల్’ మూవీ కోసం వేసిన సెట్స్ .. వాటి విశేషాలు…

* 1940 మద్రాస్ ప్రాంతంలోని ఆంధ్రా క్లబ్
* బ్రిటీష్ కాలానికి తగ్గట్లు 10 వింటేజ్ సైకిల్స్, 1 వింటేజ్ కారు
* బ్రిటీష్ కవర్ డిజైన్ తో ఉన్న 500 పుస్తకాలు
* 1940 కాలానికి చెందిన కార్గో షిప్
* 36 అడుగుల ఎత్తైన లైట్ హౌస్ సెట్ (వైజాగ్ సముద్ర తీర ప్రాంతానికి సమీపంలో)
* ఈ సెట్స్ వేయటానికి 9 ట్రక్కుల కలపను తెప్పించారు. వెయ్యి టన్నులకు పైగా ఐరన్, ఫైబర్, 10వేల చదరపు అడుగుల వింటేజ్ వాల్ పేపర్ ను ఉపయోగించారు. ఇలాంటివి మరెన్నో సెట్స్ వేశారు ఈ సినిమా కోసం.

సోషల్ మీడియాలో ఈ సెట్స్ ఫోటోలు వైరల్ అవ్వగా దీంతో సినిమాపై మరిన్ని అంచనాలు నెలకొన్నాయి.

Nandamuri Kalyan Ram Devil Movie Art Director Gandhi Construct 80 Periodic sets for movie Producer Abhishek Nama gives Full support in Budget