Sameera Sherief : ప్రాణం లేని బిడ్డను నాలుగు వారాల పాటు కడుపులోనే.. గర్భస్రావం.. యాంకర్ ఎమోషనల్ వీడియో..
తాజాగా తన యూట్యూబ్ ఛానల్ లో ఓ వీడియో పోస్ట్ చేసింది సమీరా షరీఫ్. తనకు గర్భస్రావం అయిందంటూ ఎమోషనల్ అవుతూ దాని గురించి వివరించింది.
Actress Sameera Sherief tells about her Pregnancy Miscarriage in a Video
Sameera Sherief : సీనియర్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ సన కోడలు, నటి, యాంకర్ సమీరా షరీఫ్ అందరికి పరిచయమే. తన అత్త బాటలోనే సీరియల్స్ లో, పలు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించింది. యాంకర్ గా కూడా ఓ షోతో మెప్పించింది. ప్రస్తుతం యాక్టింగ్ కి కొంచెం గ్యాప్ ఇచ్చినా సోషల్ మీడియాలో, యూట్యూబ్ వీడియోలతో మాత్రం రెగ్యులర్ గా యాక్టివ్ గా ఉంటుంది. సోషల్ మీడియాలో తన ఫ్యామిలీ కి చెందినవి అన్ని పంచుకుంటుంది.
తాజాగా తన యూట్యూబ్ ఛానల్ లో ఓ వీడియో పోస్ట్ చేసింది సమీరా షరీఫ్. తనకు గర్భస్రావం అయిందంటూ ఎమోషనల్ అవుతూ దాని గురించి వివరించింది. సమీరా షరీఫ్ 2019లో అన్వర్ జాన్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకోగా వీరికి 2021లో అర్హాన్ అనే బాబు పుట్టాడు. గతంలోనే మొదటి ప్రగ్నెన్సీ కూడా సమీరా షరీఫ్ కు గర్భస్రావం అయింది అని తెలిపింది. ఇటీవల 2023లో ప్రగ్నెన్సీ వచ్చినప్పుడు సోషల్ మీడియాలో కూడా తన ప్రగ్నెన్సీ గురించి ప్రకటించింది. అయితే అది తీసేయాల్సి వచ్చిందని ఎమోషనల్ అవుతూ తాజాగా రిలీజ్ చేసిన వీడియోలో తెలిపింది.
Also Read : Mahesh Babu : మహేష్ బాబు ‘సంక్రాంతికి వస్తున్నాం’ రివ్యూ.. పర్ఫెక్ట్ పండగ సినిమా అంటూ..
సమీరా షరీఫ్ ఈ వీడియోలో మాట్లాడుతూ.. 2023 నవంబర్ లో నేను మళ్ళీ ప్రగ్నెంట్ అయ్యాను. అందరూ సంతోషించారు. మా అబ్బాయి కూడా కడుపులో ఉండే బిడ్డతో మాట్లాడేవాడు. రెగ్యులర్ గా టెస్టులకు వెళ్ళినప్పుడు బేబీ బాగానే ఉంది అని చెప్పారు డాక్టర్లు. 12వ వారంలో స్కానింగ్ కి వెళ్ళినప్పుడు బిడ్డ ఎదుగుదల ఆగిపోయి చాలా రోజులైంది, ఆ బేబీ గుండె కొట్టుకోవట్లేదు అని చెప్పారు. ప్రాణం లేని బిడ్డను ఆల్మోస్ట్ నాలుగు వారాల పాటు కడుపులో మోసాను. దాంతో చాలా ఏడ్చాను. ఒక్కసారిగా కుప్పకూలిపోయాను. మా ఫ్యామిలీ కూడా చాలా బాధపడింది. కొన్ని రోజుల తర్వాత ఆ బిడ్డను తీసేసారు అంటూ ఎమోషనల్ అయింది.
దీంతో సమీరా వీడియో కింద పలువురు జాగ్రత్తలు చెప్తూ స్ట్రాంగ్ గా ఉండు అని కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఇది గత సంవత్సరమే జరగ్గా దీని గురించి ఇన్ని రోజుల తర్వాత తెలిపింది. ఈ వీడియోలో తన బాధని చెప్పుకోవడమే కాక ప్రగ్నెన్సీ సమయంలో డాక్టర్స్ ని కలిసింది, ఇంట్లో వాళ్ళతో ఉన్న సమయం, తన బాబుతో అదనుకున్న వీడియోలు అన్ని కూడా జత చేసింది. ప్రస్తుతం ఈ వీడియో యూట్యూబ్ లో వైరల్ గా మారింది.
Also Read : Manoj Vs Manchu Family : పండగ పూట మరోసారి ‘మంచు’ వివాదం.. తిరుపతిలో మంచు మనోజ్ వర్సెస్ మంచు ఫ్యామిలీ..
