Shilpa Shetty : నాది పునర్జన్మ.. అమ్మ కడుపులో ఉండగా అబార్షన్ చేయాలనుకున్నారు.. శిల్పాశెట్టి సంచలన కామెంట్స్

బాలీవుడ్ నటి శిల్పా శెట్టి 'సుఖీ' సినిమా ప్రమోషన్లలో బిజీగా ఉన్నారు. ఈ సందర్భంలో తన గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు.

Shilpa Shetty : నాది పునర్జన్మ.. అమ్మ కడుపులో ఉండగా అబార్షన్ చేయాలనుకున్నారు.. శిల్పాశెట్టి సంచలన కామెంట్స్

Shilpa Shetty

Updated On : September 10, 2023 / 3:38 PM IST

Shilpa Shetty : మోడల్‌గా కెరియర్ మొదలు పెట్టి ‘బాజీగర్’ సినిమాతో బాలీవుడ్ స్క్రీన్‌పై అడుగుపెట్టారు శిల్పా శెట్టి. హిందీ, కన్నడ, తెలుగు భాషల్లో చాలానే సినిమాల్లో నటించి తనదైన ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. తాజాగా ‘సుఖీ’ అనే సినిమాలో నటించిన శిల్పా శెట్టి ఆ ప్రమోషన్లతో బిజీగా ఉన్నారు. ఈ సందర్భంలో ఆమె కొన్ని ఆసక్తికరమైన విషయాలు షేర్ చేసుకున్నారు.

Virinchi Varma : లవ్ సినిమాల డైరెక్టర్.. ఇప్పుడు పొలిటికల్ యాక్షన్ డ్రామాతో.. జితేందర్ రెడ్డి టైటిల్ పోస్టర్ విడుదల..

50 ఏళ్లు వయసుకి దగ్గరపడుతున్నా చెక్కు చెదరని అందం శిల్పా శెట్టి సొంతం. బాలీవుడ్ నటుడు, వ్యాపారవేత్త రాజ్ కుంద్రాను పెళ్లాడి తల్లైన ఈ భామ నటిగా కొనసాగుతూనే ఉన్నారు. తాజాగా ‘సుఖీ’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్లో భాగంగా ఆమె మీడియాతో పంచుకున్న కొన్ని విషయాలు ఆసక్తి రేపుతున్నాయి. తన తల్లి తనను గర్భంలో మోస్తున్నప్పుడు అబార్షన్ చేయాల్సి ఉంటుందని వైద్యులు చెప్పారని శిల్పా వెల్లడించారు. తన తల్లి పరిస్థితి సీరియస్‌గా మారడంతో అబార్షన్ అనివార్యం అని అంతా అనుకున్నారట. అలాంటి పరిస్థితుల్లో తాను జన్మించానని.. తన పుట్టడం వెనుక ఏదో బలమైన కారణం ఉండి ఉంటుందని.. తనకు ఇది పునర్జన్మ అని శిల్పా చెప్పారు. ప్రతి ఒక్కరి జీవితంలో ఎన్నో కష్టాలు ఉంటాయని.. అందుకే సోషల్ మీడియాలో వారికి ప్రేరణ కలిగించేలా పోస్టులు పెడతానని శిల్పా చెప్పుకొచ్చారు. జీవితం ఎవరికీ కూడా అంత ఈజీ కాదన్నారు శిల్పా శెట్టి.

Pawan Kalyan Movies : చంద్రబాబు అరెస్టుతో ఆగిపోయిన పవన్ సినిమా షూటింగ్?

శిల్పా శెట్టి నటిస్తున్న ‘సుఖీ’ సినిమా ద్వారా సోనాల్ జోషి డైరెక్టర్‌గా పరిచయం అవుతున్నారు. అమిత్ సౌధ్, కుషా కపిల, పావ్లీన్ గుజ్రాల్, దిల్నాజ్ ఇరానీ, చైతన్య చౌదరి, జ్యోతి కపూర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా సెప్టెంబర్ 22న విడుదల కాబోతోంది.