Vedika: హీరోయిన్ బట్టలు, క్యారెక్టర్ పై కామెంట్స్.. ఎలాపడితే అలా మాట్లాడుతారా? హీరోయిన్ వేదిక ఫైర్

హీరోయిన్ వేదిక విమర్శకులపై, నెటిజన్స్ పై ఫైర్ అయ్యారు. హీరోయిన్ అయితే చాలు చాలా ఎలా పడితే అలా(Vedika) మాట్లాడేందుకు సిద్ధమైపోతారు.

Actress Vedika gets angry over negative comments

Vedika: హీరోయిన్ వేదిక విమర్శకులపై, నెటిజన్స్ పై ఫైర్ అయ్యారు. హీరోయిన్ అయితే చాలు చాలా ఎలా పడితే అలా మాట్లాడేందుకు సిద్ధమైపోతారు. ఈ తీరు మారాలి అంటూ చెప్పుకొచ్చారు వేదిక. ప్రస్తుతం ఆమె చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇటీవల ఆమె ఒక ఇంటర్వ్యూ కి హాజరయ్యారు. ఈ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. ఈ మధ్య సోషల్ మీడియాలో హీరోయిన్స్ పై అసభ్యకరమైన కామెంట్స్ ఎక్కువయ్యాయి(Vedika). కారణం లేకుండా క్యారెక్టర్ ను చంపేస్తున్నారు. కాస్త గ్లామరస్‌గా కనిపిస్తే చాలు వేలెత్తి చూపడానికి రెడీ ఉంటారు.

Deepika Padukone: కింగ్ నేర్పిన పాఠం.. ఎవరితో పనిచేస్తున్నాం అనేది ముఖ్యం.. కల్కి 2 మేకర్స్ కి దీపిక కౌంటర్?

సాధారణంగా హీరోయిన్లు అంటేనే విమర్శలకు కొదవ ఉండదు. అందులోనూ కాస్త గ్లామరస్‌ దుస్తులు ధరిస్తే ఏకంగా వారి క్యారెక్టర్‌నే తప్పుపడతయారు. ఈ విషయం నాకు చాలా బాధని కలిగించింది. హీరోయిన్స్ బట్టల గురించి మాట్లాడే దుస్థితి మారాలి. నిజానికి నేను ఇలాంటివి పెట్టించుకుని. బికినీ వేసుకొని నటించడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నాను. నేనెంతో నాకు బాగా తెలుసు. అయినా మారాల్సింది నేను కాదు తప్పుడు బుద్ధి కలవారు”అంటూ మండిపడింది వేదిక. దాంతో ఆమె చేసిన ఈ కామెంట్స్ ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి.

ఇక వేదిక విషయానికి వస్తే, మహారాష్ట్రకి చెందిన ఈ 37 ఏళ్ల బ్యూటీ ఇప్పటికీ పదహారేళ్ల పడుచుపిల్లలాగే కనిపిస్తుంది. తమిళం, తెలుగు, మలయాళం, కన్నడం, హిందీ భాషల్లో హీరోయిన్‌గా నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది. ఇటీవల ఆమె నటించిన యక్షిణి వెన్ సిరీస్ విడుదల అయ్యింది. ఈ సిరీస్ కు ఆడియన్స్ నుంచి కూడా మంచి స్పందన వచ్చింది.