Deepika Padukone: కింగ్ నేర్పిన పాఠం.. ఎవరితో పనిచేస్తున్నాం అనేది ముఖ్యం.. కల్కి 2 మేకర్స్ కి దీపిక కౌంటర్?
దీపికా పదుకొనే ఇటీవల ఈ పేరు సోషల్ మీడియాలో(Deepika Padukone) తెగ ట్రెండ్ అవుతోంది. దానికి కారణం కల్కి 2 సినిమా నుంచి ఆమెను తొలగించడం.

Deepika Padukone gives indirect counter to Kalki 2 makers
Ram Charan: ప్లాప్ హీరోయిన్ ను ఫిక్స్ చేసిన సుకుమార్.. షాక్ లో రామ్ చరణ్ ఫ్యాన్స్
ఇలా రెండు పెద్ద ప్రాజెక్టుల నుంచి దీపికా పదుకొనెను తొలగించడం పట్ల ఆమె ఫ్యాన్స్ అసంతృప్తిగా ఉన్నారట. అయితే, తాజాగా దీపికా ఇన్స్టాలో చేసిన పోస్ట్ ఒకటి ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఇటీవల ఆమె షారుక్ ఖాన్ హీరోగా వస్తున్న కింగ్ సినిమా షూటింగ్ పాల్గొనడానికి వెళ్ళింది. ఈ సందర్బంగా షారుక్ చేతిని పెట్టుకున్న ఒక ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. “18 ఏళ్ల క్రితం నా తొలి చిత్రం ‘ఓం శాంతి ఓం’ కోసం షారుఖ్ ఖాన్ తో నటించాను. ఆ సమయంలోనే ఆయన నాకు కొన్ని జీవిత పాఠాలు నేర్పించారు.
మనం ఒక సినిమా చేస్తున్నాం అంటే ఆ సినిమా ద్వారా మనం ఏం నేర్చుకున్నాం.. అలాగే ఎవరితో పని చేశాం అనే విషయాలు చాలా ముఖ్యం అని, ఇవి సినిమా విజయం కంటే ప్రధానమైనవని ఆయన చెప్పారు.ఇప్పటికీ, నా ప్రతి నిర్ణయం వెనక ఆయన చెప్పిన సూత్రాన్నే ఫాలో అవుతున్నా” అంటూ రాసుకొచ్చింది దీపికా. దీంతో ఆ పోస్ట్ కాస్త వైరల్ గా మారింది. ఇక ఈ పోస్టు కల్కి 2 మేకర్స్ కోసమే పెట్టింది అంటూ సోషల్ మీడియాలో టాక్ నడుస్తోంది.
View this post on Instagram