వావ్.. విద్యుల్లేఖ.. ఎంత మారిపోయింది!..

Vidyullekha Raman: తన నటనతో కామెడీ టైమింగ్‌తో తెలుగు, తమిళ ప్రేక్షకులను ఆకట్టుకున్న పాపులర్ లేడీ కమెడియన్ విద్యుల్లేఖా రామన్ త్వరలోనే పెళ్లి పీటలెక్కనున్నారు. ఈ లాక్‌డౌన్ సమయంలో విద్యుల్లేఖా బాగా సన్నబడ్డారు.
తాజాగా ఇన్‌స్టాలో ఆమె షేర్ చేసిన పిక్స్ చూస్తే సర్‌ప్రైజ్‌తో కూడిన షాక్ తినడం ఖాయం.. ఫొటోలు చూస్తూ.. వావ్.. విద్యుల్లేఖ అనాల్సిందే.. స్లిమ్‌గా మోడ్రన్ లుక్‌లో కనిపిస్తూ.. బరువు తగ్గితే ఎంత అందంగా ఉంటారో అంటూ అటువంటి వారికి స్ఫూర్తినిస్తోంది.
విద్యుల్లేఖ సన్నబడ్డటానికి కారణం ఆమె త్వరలోనే పెళ్లి చేసుకోబోతుండడమే.. గత కొంతకాలంగా ఫిట్‌నెస్ నిపుణులు, న్యూట్రీషియన్ సంజయ్‌తో విద్యుల్లేఖా రామన్ ప్రేమలో ఉన్నారు. ఇరు కుటుంబాల అంగీకారంతో ఆగస్ట్ 26న వీరి రోకా ఫంక్షన్ జరిగింది. త్వరలో పెళ్లి డేట్ అనౌన్స్ చేయనున్నారు.
Source: @Vidyu Raman