Adah Sharma : క్రిమినల్ ఆర్ డెవిల్ అంటున్న అదా శర్మ.. C.D ఫస్ట్ లుక్ రిలీజ్..

సరికొత్తగా సైకలాజికల్ హారర్ థ్రిల్లర్ మూవీ C.D (క్రిమినల్ ఆర్ డెవిల్) రాబోతోంది. ఇప్పటిదాకా చూసిన హారర్ జానర్స్ లో ఆడియన్స్‌కి డిఫరెంట్ అనుభూతి కలిగించే స్టోరీతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.

Adah Sharma : క్రిమినల్ ఆర్ డెవిల్ అంటున్న అదా శర్మ.. C.D ఫస్ట్ లుక్ రిలీజ్..

Adah Sharma Coming With Psychological Horror Thriller C D Criminal Or Devil First Look Released

Updated On : August 18, 2023 / 11:28 AM IST

Adah Sharma :  క్లాస్, మాస్ అనే తేడా లేకుండా అన్ని వర్గాల ప్రేక్షకులు ఆదరించే జానర్ హారర్. ఈ జానర్ లో వచ్చిన ఎన్నో సినిమాలు ఆడియన్స్‌ని థ్రిల్ చేశాయి. హారర్ జానర్ లోనూ వైవిధ్యం చూపించిన సినిమాలైతే సూపర్ డూపర్ హిట్ సాధించాయి. ఇప్పుడు అదే బాటలో సరికొత్తగా సైకలాజికల్ హారర్ థ్రిల్లర్ మూవీ C.D (క్రిమినల్ ఆర్ డెవిల్) రాబోతోంది. ఇప్పటిదాకా చూసిన హారర్ జానర్స్ లో ఆడియన్స్‌కి డిఫరెంట్ అనుభూతి కలిగించే స్టోరీతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. రీసెంట్ గా ది కేర‌ళ స్టోరీ మూవీతో సూపర్ హిట్ ఖాతాలో వేసుకున్న అదా శర్మ ఈ సినిమాలో లీడ్ రోల్ పోషిస్తుండటం విశేషం.

C.D (క్రిమినల్ ఆర్ డెవిల్) అనే టైటిల్‌తో రూపొందుతున్న ఈ సినిమాకు కృష్ణ అన్నం దర్శకత్వం వహిస్తున్నారు. SSCM ప్రొడక్షన్స్ బ్యానర్ పై తెరకెక్కుతుండగా గిరిధర్ ఎగ్జిగూటివ్ ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు. RR ధృవన్ సంగీతం అందిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఈ క్రమంలోనే చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా తాజాగా ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు.

ఈ ఫస్ట్ లుక్ పోస్టర్‌లో అదా శర్మ సీరియస్ లుక్‌, ఆ చుట్టూ డెవిల్స్ హ్యాండ్స్ కనిపిస్తుండటం చిత్రంలోని వైవిధ్యాన్ని తెలుపుతున్నాయి. C.D అనే టైటిల్ క్రిమినల్ ఆర్ డెవిల్ అనే ట్యాగ్ లైన్‌తో పోస్టర్ చూడగానే సినిమాపై ఆసక్తి నెలకొనేలా ఈ ఫస్ట్ లుక్ డిజైన్ చేశారు. ప్రేక్షకులకు థ్రిల్లింగ్ ఎక్స్‌పీరియన్స్ ఇవ్వడంలో కొత్త దారిలో వెళుతున్నాం అని పోస్టర్ ద్వారా కన్ఫర్మ్ చేశారు మేకర్స్. ఈ C.D ఫస్ట్ లుక్ పోస్టర్ సినిమాపై క్యూరియాసిటీ పెంచిందనే చెప్పుకోవచ్చు.

Sagileti Katha : ‘ఆర్జీవీ’ చేతుల మీదగా.. ‘సగిలేటి కథ’ మూవీ ‘ఏదో జరిగే’ సాంగ్ గ్రాండ్ లాంచ్..

ఈ మూవీలో రీసెంట్ సెన్సేషన్ అదా శర్మ కీలక పాత్ర పోషిస్తుండగా.. విశ్వంత్, జబర్దస్త్ రోహిణి, భరణి శంకర్, రమణ భార్గవ్, మహేష్ విట్టా ఇతర ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రానికి ఏ.ముద్దు కృష్ణ డైలాగ్స్ అందించగా, సతీష్ ముత్యాల సినిమాటోగ్రాఫర్‌గా పని చేస్తున్నారు. సత్య గిడుతూరి ఎడిటింగ్ బాధ్యతలు చేపట్టారు. చిత్రానికి సంబంధించిన అన్ని పనులు ఫినిష్ చేసి అతి త్వరలో ఈ సినిమా రిలీజ్ డేట్ ప్రకటిస్తామని మేకర్స్ చెప్పారు.

 

Adah Sharma Coming With Psychological Horror Thriller C D Criminal Or Devil First Look Released