Adah Sharma: నెటీజన్ ట్వీట్‌కు స్పందించిన అదా శర్మ.. మీరు అరుదైన అద్భుతం అంటూ..
నటి అదా శర్మ(Adah Sharma ) లీడ్ రోడ్‌లో నటించిన సినిమా ది కేరళ స్టోరీ(The Kerala Story). సుదీప్తోసేన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంమే 5న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

Adah Sharma
Adah Sharma Tweet: నటి అదా శర్మ(Adah Sharma ) లీడ్ రోడ్‌లో నటించిన సినిమా ది కేరళ స్టోరీ(The Kerala Story). సుదీప్తోసేన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం మే 5న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కొంత మంది అమ్మాయిలను మతం మార్చి టెర్రరిజంలోకి తీసుకువెలుతున్నారు అనే కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమాకు విపుల్ షా నిర్మాత. ఈ చిత్రంలో ఆదా శర్మ నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఆమె పేరే వినిపిస్తోంది. ఆమెను అభినందిస్తూ పలువురు సెలబ్రెటీలు, నెటీజన్లు ట్వీట్లు చేస్తున్నారు.
విడుదలకు ముందే కొన్ని వివాదాలు చుట్టుముట్టినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపిస్తోంది. రూ.200 కోట్లకు పైగా రాబట్టింది. ఈ నేపథ్యంలో.. ఓ మహిళ లీడ్ రోల్‌లో నటించిన సినిమా రూ.200 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది అని ఆదా శర్మ ఉన్న పోస్టర్‌ను ఓ నెటిజన్ షేర్ చేశాడు. ‘ఓ మహిళా సైన్యం.. ఒక అద్భుతాన్ని చూసిన వ్యక్తి గురించి తెలుసుకోవడం నా అదృష్టం..’ అంటూ రాసుకొచ్చాడు.
Adah Sharma : నేను బాగానే ఉన్నా.. ప్రమాదంలో స్వల్ప గాయాలు.. అదా శర్మ ట్వీట్!
దీనిని చిత్ర బృందం రీ ట్వీట్ చేసింది. దీని గురించి తెలుసుకున్న హీరోయిన్ అదా శర్మ.. “మరొకరి అద్భుతాన్ని బహిరంగంగా గుర్తించినందుకు మీరే అరుదైన అద్భుతం.” అంటూ ఆ యూజర్ ట్వీట్‌ను రీ ట్వీట్ చేసింది. ప్రస్తుతం వీరి ట్వీట్లు వైరల్ గా మారాయి.
You are a rare miracle yourself to publicly acknowledge another’s miracle ???? https://t.co/4OPWqLwFfb
— Adah Sharma (@adah_sharma) May 25, 2023
ఇదిలా ఉంటే.. ఇటీవల ఈ చిత్ర బృందానికి సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ సినిమా ప్రదర్శనకు ముందు ఇది సృజనాత్మక సృష్టి అని, కల్పిత కథ అని ఖచ్చితంగా డిస్‌క్లయిమర్ ప్రదర్శించాలని ఆదేశించింది. ఈ చిత్రంలో చెప్పినట్లుగా కేరళలో 32 వేల మంది మహిళలు ఇస్లాం మతంలోకి మారారు అని చెప్పడానికి ఎలాంటి ప్రామాణికత లేదని, అందుకనే సినిమాకి ముందు డిస్‌క్లయిమర్ వేయాలని న్యాయస్థానం స్పష్టం చేసింది.