Adda Teegala : కేవలం మూడు క్యారెక్టర్‌లతో రోడ్ ట్రిప్ థ్రిల్లర్ సినిమాగా ‘అడ్డతీగల’

శ్రీ శృంఖలా దేవి ఫిల్మ్స్ బ్యానర్ పై గాదిరాజు రామరాజు దర్శకత్వంలో కొత్త నటీనటులు అర్జున్, వసంతిలు జంటగా 'అడ్డతీగల' అనే కొత్త చిత్రం రాబోతుంది. తాజాగా ఇవాళ ఈ సినిమా ట్రైలర్ ని......

Adda Teegala : కేవలం మూడు క్యారెక్టర్‌లతో రోడ్ ట్రిప్ థ్రిల్లర్ సినిమాగా ‘అడ్డతీగల’

Adda Teegala

Updated On : March 13, 2022 / 6:47 PM IST

Adda Teegala :  ఇటీవల కాలంలో చిన్న సినిమాలు చాలా వస్తున్నాయి. కంటెంట్ ఉంటే చాలు అంటూ మంచి కంటెంట్ తో అనేక చిన్న సినిమాలు వస్తున్నాయి. తాజాగా మరో చిన్న సినిమా త్వరలో రాబోతుంది. శ్రీ శృంఖలా దేవి ఫిల్మ్స్ బ్యానర్ పై గాదిరాజు రామరాజు దర్శకత్వంలో కొత్త నటీనటులు అర్జున్, వసంతిలు జంటగా ‘అడ్డతీగల’ అనే కొత్త చిత్రం రాబోతుంది. తాజాగా ఇవాళ ఈ సినిమా ట్రైలర్ ని విడుదల చేశారు.

20 సంవత్సరాల పాటు ఇండియాలోని ప్రముఖ టీవీ మీడియా, గ్రాఫిక్స్ విభాగంలో సేవలు అందించిన రామరాజు ఈ సినిమాతో దర్శకుడిగా మారారు. ట్రైలర్ విడుదల సందర్భంగా దర్శకుడు రామరాజు మీడియాతో మాట్లాడుతూ.. ”నేను ఇంతకు ముందు ఏ దర్శకుడు దగ్గర పనిచేయలేదు, నాకున్న గ్రాఫిక్స్ అనుభవంతో హై ఎండ్ టెక్నికల్ వాల్యూస్ తో ఈ చిత్రాన్ని నిర్మించాను. రోడ్ ట్రిప్ బ్యాక్డ్రాప్ లో జరిగే ఈ థ్రిల్లర్ సినిమా ఆద్యంతం ఉత్కంఠ భరితంగా ఉంటుంది. కేవలం మూడు క్యారెక్టర్ లతో తెలుగులో ఇంతవరకు ఎప్పుడూ చూడని కొత్త కథనంతో ఈ చిత్రాన్ని తెరకెక్కించాము. రంపచోడవరం, అడ్డతీగల, మారేడుమల్లిలోని దట్టమైన అడవి ప్రాంతంలో దాదాపు 2 నెలలు అనేక కష్టాలను ఎదుర్కొని ఈ సినిమా షూటింగ్ ని నిర్వహించాము. కొన్ని రియాలిస్టిక్ సంఘటనల ఆధారంగా ఈ సినిమాని నిర్మించాము” అని తెలిపారు.

Paruchuri : పరుచూరి వెంకటేశ్వరరావు ఎలా మారిపోయారో చూడండి.. షాక్‌లో ప్రేక్షకులు..

త్వరలో ఈ సినిమాని థియాటర్లోను, ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ లోను తమ చిత్రాన్ని విడుదల చేస్తున్నట్లు, అంతే కాక ఈ బ్యానర్ లో మరిన్ని చిత్రాలు నిర్మించబోతున్నట్లు రామరాజు మీడియాకు తెలిపారు. ఈ సినిమాని జి. రాధిక నిర్మించగా మహత్రు మీడియా సొల్యూషన్స్ విజువల్ ఎఫెక్ట్స్ అందించనుంది. మహావీర్ యెలందర్ మ్యూజిక్ ని అందిస్తున్నారు. మురళీధర్ సింగ్ కెమెరామాన్ గా వ్యవహరించారు.